రైలు టాయిలెట్‌లో అప్పుడే పుట్టిన శిశువును వదిలివెళ్లిన మహిళ
Woman left her baby in the Train Toilet.కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తల్లి, ఆ చిన్నారి పట్ల కర్కశంగా
By తోట వంశీ కుమార్ Published on
11 May 2022 6:05 AM GMT

కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తల్లి, ఆ చిన్నారి పట్ల కర్కశంగా వ్యవహరించింది. నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లికి ఆ చిన్నారి బరువైందో ఏమో తెలీదు కానీ రైలులోని టాయిలెట్‌లో చిన్నారిని వదిలి వెళ్లిపోయింది. మాతృప్రేమకి మాయని మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తించింది. విశాఖలోని బొకారో ఎక్స్‌ప్రెస్ రైలులో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఓ గుర్తు తెలియని మహిళ రైలులో శిశువుకు జన్మనిచ్చింది. పుట్టిన శిశువును రైలులోని టాయిలెట్‌లోనే వదిలి వెళ్లిపోయింది. ప్రయాణీకులకు చిన్నారి ఏడుపు వినిపించగా.. టాయిలెట్‌లో వారికి శిశువు కనిపించింది. వారు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ పోలీసులు అక్కడికి చేరుకుని ఆ చిన్నారిని రైల్వే ఆస్పత్రికి తరలించారు. దీనిపై విచారణ చేపట్టారు.
Next Story