వైజాగ్ : శివలింగపురం యార్డ్ దగ్గర ప‌ట్టాలు త‌ప్పిన గూడ్స్ రైలు

Vizag Goods train derails near Sivalingpuram Yard.విశాఖ‌-కిరండుల్ రైల్వే లైన్‌లో గూడ్స్ రైలు ప‌ట్టాలు త‌ప్పింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Feb 2023 10:52 AM IST
వైజాగ్ : శివలింగపురం యార్డ్ దగ్గర ప‌ట్టాలు త‌ప్పిన గూడ్స్ రైలు

విశాఖపట్నం : విశాఖ‌-కిరండుల్ రైల్వే లైన్‌లో గూడ్స్ రైలు ప‌ట్టాలు త‌ప్పింది. బచ్చెలి నుంచి విశాఖపట్నం వైపు వస్తున్న గూడ్స్ రైలు గురువారం తెల్లవారుజామున టన్నెల్-7 కంటే ముందు శివలింగపురం యార్డ్ సమీపంలో పట్టాలు తప్పింది. ఎనిమిది లోడెడ్ వ్యాగన్లు పట్టాలు తప్పాయి. గూడ్స్ రైలు ప‌ట్టాలు త‌ప్ప‌డంతో ప‌లు రైళ్ల రాక‌పోక‌ల‌ను అంత‌రాయం క‌లిగింది. ఈ మార్గంలో ప్యాసింజ‌ర్ రైళ్ల‌ను ర‌ద్దు చేశారు.

ప్ర‌మాదం జ‌రిగిన ప్ర‌దేశంలో యుద్ధ ప్రాతిప‌దిక‌న మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టడానికి కోరాపుట్, విశాఖపట్నం నుండి రైల్వే సిబ్బంది ఘ‌ట‌నాస్థలానికి చేరుకున్నారు. DRM, వాల్టెయిర్, అనుప్ కూడా అక్క‌డి చేరుకుని ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. విశాఖపట్నం-కిరండూల్ రైలు 08551 ను రైల్వే అధికారులు రద్దు చేశారు. టికెట్లు కొనుగోలు చేసిన వారికి న‌గ‌దును తిరిగి ఇచ్చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో టికెట్లు కొనుగోలు చేసిన వారు రీఫండ్ కోసం టీడీఆర్ ఫైల్ చేయాలని సూచించారు.

కాగా.. నెలరోజుల వ్యవధిలో పట్టాలు తప్పడం ఇది రెండో ఘటన కావడం గ‌మ‌నార్హం.

Next Story