ఫ్లాట్‌ఫామ్‌కి, రైలుకి మ‌ధ్య‌న ఇరుక్కున్న విద్యార్థిని.. గంట‌న్న‌ర పాటు న‌ర‌క‌యాత‌న‌

Student Stucked between Train and plotform at Duvvada Railway Station.రైలు దిగుతున్న క్ర‌మంలో ఓ విద్యార్థిని అదుపు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Dec 2022 11:40 AM IST
ఫ్లాట్‌ఫామ్‌కి, రైలుకి మ‌ధ్య‌న ఇరుక్కున్న విద్యార్థిని.. గంట‌న్న‌ర పాటు న‌ర‌క‌యాత‌న‌

రైలు దిగుతున్న క్ర‌మంలో ఓ విద్యార్థిని అదుపు త‌ప్పి ఫ్లాట్‌ఫాం, రైలుకు మ‌ధ్య ఇరుక్కుపోయింది. దాదాపు గంట‌న్న‌ర పాటు న‌ర‌క‌యాత‌న అనుభ‌వించింది. చివ‌రికి అధికారులు ఫ్లాట్‌ఫామ్‌ను బ‌ద్ద‌లు కొట్టి యువ‌తిని ర‌క్షించారు. ఈ ఘ‌ట‌న విశాఖ‌ప‌ట్నం జిల్లా దువ్వాడ రైల్వే స్టేష‌న్‌లో బుధ‌వారం చోటు చేసుకుంది.

వివ‌రాలు ఇలా ఉన్నాయి.. అన్న‌వరానికి చెందిన శ‌శిక‌ళ (20) దువ్వాడ‌లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో ఎంసీఏ మొద‌టి సంవ‌త్స‌రం చ‌దువుతోంది. రోజు మాదిరిగానే గుంటూరు-రాయ‌గ‌డ ఎక్స్ ప్రెస్ రైలులో దువ్వాడ‌కు వ‌చ్చింది. రైలు దిగుతున్న క్ర‌మంలో అదుపుత‌ప్పి ఫ్లాట్‌ఫామ్ కిందికి జారీ ప‌డింది. రైలుకు ఫ్లాట్‌ఫామ్ మ‌ధ్య‌కు ఇరుక్కుని పోయింది. బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మైంది.

పక్క‌న ఉన్న ప్ర‌యాణీకులు ఆమెను ర‌క్షించేందుకు ప్ర‌య‌త్నించారు. అయిన‌ప్ప‌టికీ లాభం లేక‌పోయింది. రైల్వే అధికారుల‌కు స‌మాచారం అందించారు. వారు వ‌చ్చి ఫ్లాట్‌ఫామ్‌ను బ‌ద్ద‌లు కొట్టి యువ‌తిని రక్షించారు. అనంత‌రం హుటాహుటిన ఆమెను అంబులెన్స్‌లో ఆస్ప‌త్రికి తీసుకువెళ్లారు. దాదాపు గంట‌న్న‌ర పాటు యువ‌తి న‌ర‌క‌యాత‌న అనుభ‌వించింది.

Next Story