విశాఖ‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. విధులు ముగించుకుని ఇంటికి వెలుతుండ‌గా

Road accident in Visakhapatnam CI died.విశాఖప‌ట్నం స‌మీపంలోని ఎండాడ వ‌ద్ద గురువారం తెల్ల‌వారుజామున ఘోర రోడ్డు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Nov 2021 9:08 AM IST
విశాఖ‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. విధులు ముగించుకుని ఇంటికి వెలుతుండ‌గా

విశాఖప‌ట్నం స‌మీపంలోని ఎండాడ వ‌ద్ద గురువారం తెల్ల‌వారుజామున ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. పోలీస్ వాహ‌నాన్ని గుర్తు తెలియ‌ని వాహ‌నం ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో త్రీ టౌన్ సీఐ మృతి చెంద‌గా.. కానిస్టేబుల్ తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. త్రీ టౌన్ సీఐ క‌ర‌ణం ఈశ్వ‌ర‌రావు విధులు ముగించుకుని ఎండాడ మీదుగా మ‌ధుర‌వాడ‌లోని త‌న నివాసానికి వెతులుతుండ‌గా.. ఉద‌యం 3.40 గంట‌ల‌కు వీరు ప్ర‌యాణిస్తున్న వాహ‌నాన్ని గుర్తు తెలియ‌ని వాహ‌నం బ‌లంగా ఢీ కొట్టింది. ప్ర‌మాదం ధాటికి పోలీసు కారు ముందు భాగం ధ్వంసమైంది.

ఈ ప్ర‌మాదంలో సీఐ క‌ర‌ణం ఈశ్వ‌ర‌రావు అక్క‌డిక్క‌డే ప్రాణాలు కోల్పోగా.. కానిస్టేబుల్ సంతోష్‌ తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. గాయ‌ప‌డిన కానిస్టేబుల్‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. సీఐ ఈశ్వరరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ప్రమాదానికి కారణమైన వాహనం కోసం వెతుకుతున్నామని.. జాతీయ రహదారిపై సీసీకెమెరాలను ప‌రిశీలిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. సీఐ ఈశ్వరరావు మృతి దురదృష్టకరమని సీపీ మనీష్‌ కుమార్‌ సిన్హా అన్నారు. పదవీ విరమణకు రెండేళ్లు ఉన్న తరుణంలో ప్రమాదం బాధకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఘ‌ట‌నా స్థ‌లాన్ని ఆయ‌న ప‌రిశీలించారు.

Next Story