విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో సాయిప్రియ అదృశ్యమైన ఘటనలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. సముద్రంలో గల్లంతు అయిందనుకుంటే బెంగళూరులో ప్రియుడు రవితో ప్రత్యక్ష్యమైంది. అతడితో తనకు వివాహమైందని, తనని వెతకొద్దని చెప్పి అందరికీ షాకిచ్చింది. శుక్రవారం రాత్రి పోలీసులు వారిని బెంగళూరు నుంచి తీసుకువచ్చారు. వివరాలు నమోదు చేసుకున్న అనంతరం వారిని పంపించివేశారు.
ప్రియాంక కనిపించకుండా పోవడంతో ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా స్పందించిన ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులు ఆమె కోసం ఒక రోజంతా గాలించారు. మూడు కోస్ట్ గార్డ్ షిప్స్, ఒక హెలికాఫ్టర్ సాయంతో సముద్రాన్ని జల్లెడపట్టారు. కాగా.. సాయి ప్రియా ఆడిన డ్రామా పై కోర్టు గార్డ్ సిరీయస్ అయింది. డ్రామా ఆడిన సాయి ప్రియ పై చర్యలు తీసుకోవాలని వైజాగ్ పోలీస్ కమిషనర్ తో పాటు జీవీఎంసీ కమిషనర్ కు మెయిల్ చేసింది.
తప్పుడు సమాచారంతో అత్యంత ఖర్చుతో కూడిన మూడు కోస్ట్ గార్డ్ షిప్స్, ఒక హెలికాప్టర్ ను రెస్క్యూకి పంపించామని, అత్యంత విలువైన మానవసేవలు వృథా అయ్యాయని మండిపడింది. మరోసారి ఇలా జరగకుండా ఉండాలంటే సాయి ప్రియాంకపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు,జీవీఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసింది. మరీ సాయిప్రియ చేసిన డ్రామా పై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.