గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023లో సీత, ఆయుధ, మినీ సైబీరియా సందడి

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023లో సీత, ఆయుధ, మినీ సైబీరియా రోబోలు సందర్శకులను ఆకట్టుకున్నాయి.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 March 2023 10:54 AM IST
Global investors summit,Visakhapatnam

విశాఖపట్నంలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సులో రోబో సీత

విశాఖపట్నం: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023లో సీత, ఆయుధ, మినీ సైబీరియా రోబోలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023లో ఇవి మంచి ఆకర్షణగా నిలిచాయి. రోబోకప్లర్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకులు ప్రవీణ్ మల్లా, కిరణ్ మల్లా బృందం ఈ రోబోలను సృష్టించింది. రోబోట్ సీత సంప్రదాయ చీర నగలు ,ధరించి ఉండగా, ఆయుధ ఒక సర్వింగ్ ట్రేతో నిలబడి ఉంది. మినీ సైబీరియా నలుపు, తెలుపు రంగులో ఉంది.

న్యూస్‌మీటర్‌తో కిరణ్ మల్లా మాట్లాడుతూ.. మన జీవితాల్లోనూ, విధుల్లోనూ ఉన్న కొన్ని కొన్ని పనులను పూర్తీ చేయడానికి మేము రోబోలను ఉపయోగిస్తున్నాము. మనిషి మనుగడలో ఉన్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించామని తెలిపారు.

కాఫీ రోబోట్- సీత

అరకు లోయ కాఫీ మ్యూజియం కోసం రోబోట్ సీత సృష్టించబడింది. సీత అరకు లోయకు సంబంధించి వివిధ రకాల కాఫీల గురించి అన్ని ఇన్‌పుట్‌లతో ప్రోగ్రామ్ చేశారు. సీత కొలువుదీరిన మ్యూజియం ఉన్న ప్రాంతాల్లోని కాఫీ గురించి జ్ఞానాన్ని అందించడానికి ఉపయోగపడుతుంది. కాఫీ గింజలను తీసుకున్న వెంటనే కాఫీ తయారీకి సంబంధించిన 13 దశలను సీత వివరించగలదు. ఆమెకు ఇంగ్లీషు, తెలుగు, తమిళం వచ్చు.

విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023లో రోబో సీతతో పాటు రోబోకప్లర్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిరణ్ మల్లా

హోటల్/హాస్పిటల్ అవసరాల కోసం రోబోట్- ఆయుధ

ఆయుధ ట్రేతో నిలబడి ఉన్న రోబోట్. ఆమె డిజైన్ లైన్ పలు విభాగాలపై ఆధారపడి ఉంటుంది, ఆమె తనకు కేటాయించిన లైన్‌లో కదలగలదు. హోటళ్లలో ఆయుధ ఆర్డర్లు తీసుకుని కస్టమర్లకు సేవలందిస్తుంది. ఆసుపత్రులలో, ఆయుధ ఔషదాలు, ఇతర వైద్య సామగ్రిని అందిస్తుంది. అప్పుడు ఆయుధకు నర్సింగ్ సిబ్బందికి ఇచ్చే ట్రేను ఇవ్వాల్సి ఉంటుంది. "ఆసుపత్రులు మరియు హోటళ్లలో ఈ రెండు నమూనాలు ప్రయత్నించాం. మంచి ఫలితాలు సాధించాం" అని రోబోకప్లర్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిరణ్ మల్లా అన్నారు.

విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023లో రోబో ఆయుధతో పాటు రోబోకప్లర్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిరణ్ మల్లా.

రోబో స్కానర్- మినీ సైబీరియా:

రోబోట్ మినీ సైబీరియా వ్యక్తులను గుర్తించడానికి రూపొందించబడింది. ఇది హై-సెక్యూరిటీ జోన్‌లలో స్కానింగ్‌ను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. విమానాశ్రయాలు, బహిరంగ ప్రదేశాలు, నైట్ విజిలెన్స్ వంటి విషయాల్లో దీన్ని ఉపయోగిస్తూ ఉన్నారు.

విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023లో మినీ సైబీరియా రోబోను ప్రదర్శించారు.

Next Story