ఆర్కే బీచ్‌లో ఏం జ‌రిగింది..? పెళ్లి రోజు నాడే వివాహిత అదృశ్యం

Married woman goes missing at RK Beach in Visakhapatnam.పెళ్లి రోజు కావ‌డంతో ఆ దంప‌తులు స‌ర‌దాగా గ‌డిపేందుకు బీచ్‌కు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 July 2022 9:28 AM GMT
ఆర్కే బీచ్‌లో ఏం జ‌రిగింది..?  పెళ్లి రోజు నాడే వివాహిత అదృశ్యం

పెళ్లి రోజు కావ‌డంతో ఆ దంప‌తులు స‌ర‌దాగా గ‌డిపేందుకు బీచ్‌కు వెళ్లారు. అక్క‌డ కాసేపు ఉన్న త‌రువాత‌ ఇంటికి వెళ్ల‌డానికి సిద్ద‌మ‌య్యారు. ఈ క్ర‌మంలో వివాహిత అదృశ్య‌మైంది. ఈ ఘ‌ట‌న విశాఖ‌ప‌ట్నంలోని ఆర్కే బీచ్‌లో చోటు చేసుకుంది. భ‌ర్త ఫిర్యాదు మేర‌కు కేసు నమోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. వివాహిత కోసం సెర్చ్ ఆప‌రేష‌న్‌ను మొద‌లు పెట్టారు.

వివ‌రాల్లోకి వెళితే.. శ్రీనివాస్‌, సాయి ప్రియ‌ కు రెండేళ్ల క్రితం వివాహ‌మైంది. సోమ‌వారం పెళ్లి రోజు కావ‌డంతో ఉద‌యం సింహాచ‌లం గుడికి వెళ్లి మ‌ధ్యాహ్నాం ఇంటికి వ‌చ్చారు. అనంత‌రం సాయంత్రం ఆర్కే బీచ్ కు వెళ్లారు. ఇద్ద‌రూ కాసేపు అక్క‌డ ఫోటోలు దిగుతూ కాల‌క్షేపం చేశారు. రాత్రి 7.30 గంటల సమయంలో తిరిగి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యారు. అయితే.. కాళ్లు క‌డుక్కోవ‌డానికి సాయి ప్రియ తీరానికి వెళ్లిన‌ట్లు భ‌ర్త శ్రీనివాస్ పోలీసుల‌కు తెలిపాడు.

ఆ స‌మ‌యంలో తాను మొబైల్ చూస్తున్నాన‌ని, వెన‌క్కి గ‌మ‌నించ‌లేద‌ని చెప్పాడు. సాయి ప్రియ క‌నిపించ‌క‌పోవ‌డంతో అక్క‌డ అంతా వెతికినా ప్ర‌యోజ‌నం లేక‌పోయింద‌ని తెలిపాడు. దీంతో కేసు న‌మోదు చేసిన పోలీసులు నిన్న రాత్రంతా సెర్చ్ ఆప‌రేష‌న్ చేప‌ట్టారు. ఫ‌లితం లేక‌పోవ‌డంతో ఈరోజు మ‌ళ్లీ గాలిస్తున్నారు. అన్ని కోణాల్లోనూ ఆరా తీస్తున్నారు. కాగా.. సాయి ప్రియ అదృశ్యంపై ప‌లు అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.

Next Story