దారుణం.. అన్నా అని వేడుకున్నా.. తోటలోకి లాక్కెళ్లి..

Man molested girl in Visakhapatnam.ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు తెచ్చిన‌ప్ప‌టికి మ‌హిళ‌ల‌పై దారుణాలు ఆగ‌డం లేదు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Jan 2022 3:14 AM GMT
దారుణం.. అన్నా అని వేడుకున్నా.. తోటలోకి లాక్కెళ్లి..

ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు తెచ్చిన‌ప్ప‌టికి మ‌హిళ‌ల‌పై దారుణాలు ఆగ‌డం లేదు. కామంతో క‌ళ్లు మూసుకుపోయిన కామాంధులు నిత్యం ఏదో ఒక చోట మ‌హిళ‌ల‌పై దాడుల‌కు పాల్ప‌డుతూనే ఉన్నారు. అన్నయ్యా.. ప్లీజ్‌ నన్ను వదిలెయ్‌.. అంటూ 11 ఏళ్ల మైన‌ర్ బాలిక కాళ్లావేళ్లా ప‌డ్డా వ‌దిలిపెట్ట‌లేదు. తాను అన్న‌య్య‌ను కాదు అని మామ‌య్య‌ను అవుతానంటూ.. బాలిక నోట్లో గుడ్డ‌లు కుక్కి, తోట‌లోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఆ ఘ‌ట‌న‌ను మొత్తం వీడియో తీశాడు. విష‌యం ఎవ‌రికైనా చెబితే.. చంపేస్తాన‌ని బెదిరించ‌డంతో పాటు బాధిత బాలిక అమ్మ‌, అక్క స్నానం చేసేట‌ప్పుడు వీడియోలు తీసి పంపించాల‌ని హెచ్చ‌రించాడు. ఈ దారుణ ఘ‌ట‌న విశాఖ‌ప‌ట్నం జిల్లా న‌క్క‌ప‌ల్లి మండ‌లంలో చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే.. రాజ‌య్య‌పేట‌లో 11 ఏళ్ల బాలిక ఆరో త‌ర‌గ‌తి చ‌దువుతోంది. గురువారం సాయంత్రం పాఠ‌శాల నుంచి ఇంటికి వ‌చ్చింది. వంట చెర‌కు కోసం ఆమె సోద‌రి స‌మీపంలోని జీడితోట‌కు వెళ్లింది. ఆమెకు సాయం చేసేందుకు బాలిక కూడా అక్క వ‌ద్ద‌కు బ‌య‌లుదేరింది. మార్గ‌మ‌ధ్యంలో అదే గ్రామానికి చెందిన నాగేశ్‌(22) బాలిక‌ను అడ్డుకున్నాడు. బాలిక నోట్లో గుడ్డ‌లు కుక్కి.. దూరంగా లాక్కెళ్లాడు. క‌త్తితో బెదిరించి బాలిక‌పై అత్యాచారం చేశాడు.

బాలిక న‌గ్నంగా ఉన్న ఫోటోలు, వీడియోలు తీశాడు. విష‌యం ఎవ‌రికైనా చెబితే చంపేస్తామ‌ని బెదిరించాడు. అంతేకాకుండా బాధిత బాలిక త‌ల్లి. అక్క స్నానం చేసేట‌ప్పుడు వారి వీడియోలు తీసి త‌న‌కు పంపాల‌ని హెచ్చరించాడు. సుమారు మూడు గంట‌ల పాటు బాలిక‌ను హింసించాడు. విష‌యం ఎవ‌రికీ చెప్ప‌ని బాలిక అత‌డిని వేడుకోవ‌డంతో.. బైక్‌పై బాలిక‌ను తీసుకువ‌చ్చి బాలిక ఇంటి స‌మీపంలో దించేసి వెళ్లిపోయాడు.

అప్ప‌టికే బాలిక క‌నిపించ‌క‌పోవ‌డంతో ఆమె త‌ల్లిదండ్రులు బాలిక కోసం వెతుకుతుండ‌గా.. బాలిక ఇంటికి చేర‌డంతో ఊపిరిపీల్చుకున్నారు. అయితే.. కుటుంబ‌స‌భ్యుల‌కు జ‌రిగిన విష‌యాన్నిబాలిక మొత్తం చెప్పింది. వెంట‌నే వారు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.


Next Story