విశాఖ హెచ్‌పీసీఎల్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం
fire accident at HPCL plant in Visakhapatnam. విశాఖలో హెచ్‌పీసీఎల్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
By Medi Samrat Published on
25 May 2021 10:31 AM GMT

విశాఖలో హెచ్‌పీసీఎల్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కొత్తగా నిర్మిస్తున్న చిమ్నిలో అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. భారీ శబ్దం రావడంతో స్థానికులు భయాందోళలకు గురవుతున్నారు. ప్రమాద స్థలానికి చుట్టుపక్కల దట్టంగా పొగ అలుముకుంది. ప్రమాదం జరగడంతో అధికారులు మూడు సార్లు సైరన్ మోగించి ఉద్యోగులను బయటకు పంపించారు. సమాచారం అందిన వెంటనే ప్రమాదస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
ప్రమాద సమయంలో అక్కడ 100 మంది ఉద్యోగులు ఉన్నారని.. వారంతా క్షేమంగా ఉన్నారని సమాచారం. ఎటువంటి ప్రాణహాని, గాయాలు జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తరచూ విశాఖలో ప్రమాదాలు జరుగుతుండటంతో అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
Next Story