విశాఖ జిల్లా పరవాడ ఫార్మా సిటిలో ఎల్పీజీ(లిక్విడ్ పెట్రోలియం గ్యాస్) లోడ్ ట్యాంకర్ బోల్తా పడింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కంపెనీ నుంచి గ్యాస్ ఫిల్ చేసుకుని కొద్ది దూరం వెళ్లగానే ట్యాంకర్ బోల్తా పడింది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ట్యాంకర్‌ను క్రేన్ సాయంతో పైకి లాగుతుండగా.. రంథ్రం ఏర్పడి గ్యాస్ లీకేజీ అవుతోంది. దీంతో ట్యాంకర్ బోల్తా పడిన ప్రాంతంలో విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. గ్యాస్ లీక్ అవుతుండడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.
బోల్తాపడిన ట్యాంకర్‌ను ఎట్టకేలకు పైకి లేపారు. అయితే.. ట్యాంకర్ నుంచి గ్యాస్ లీకేజీ ఆగడం లేదు. లీకేజీ ఆపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. నాన్‌స్టాప్‌గా వాటర్‌ను పంపింగ్ చేస్తూనే ఉన్నారు. మరో ట్యాంకర్ తీసుకువచ్చి అందులోకి గ్యాస్‌ను నింపేప్రయత్నాలు చేస్తున్నారు. ఎల్పీజీ గ్యాస్ ట్యాంకర్‌లో 17వేల టన్నుల గ్యాస్ ఉన్నట్లు తెలుస్తోంది. ట్యాంకర్ ఓపెన్ ప్లేస్‌లో ఉండంతో లీకేజీతో పెద్ద ప్రమాదం ఉండకపోవచ్చునని అంటున్నారు.