విశాఖలో టెన్షన్ టెన్షన్.. పవన్‌ కోసం భారీ సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు

Hundreds gather outside Pawan kalyans hotel after police deny rally permission. విశాఖపట్నం నగరంలో ర్యాలీకి అనుమతి నిరాకరించడంతో జననేత అధినేత పవన్‌ కల్యాణ్‌కు సంఘీభావంగా వందలాది మంది ప్రజలు

By అంజి  Published on  17 Oct 2022 7:26 AM GMT
విశాఖలో టెన్షన్ టెన్షన్.. పవన్‌ కోసం భారీ సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు

విశాఖపట్నం నగరంలో ర్యాలీకి అనుమతి నిరాకరించడంతో జననేత అధినేత పవన్‌ కల్యాణ్‌కు సంఘీభావంగా వందలాది మంది ప్రజలు హోటల్‌ బయటే బైఠాయించారు. దీంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బస చేస్తున్న నోవాటెల్ బీచ్ ప్రాంతంలో టెన్షన్ నెలకొంది. రాజకీయ నాయకుడిగా మారిన నటుడు పవన్‌ కల్యాణ్‌కు నగరంలో ర్యాలీ నిర్వహించేందుకు విశాఖపట్నం పోలీసులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో ఇది జరిగింది. పవన్ కళ్యాణ్ బస చేసిన హోటల్ బయట వందలాది మంది, ముఖ్యంగా మహిళలు తమ పిల్లలతో కలిసి క్యాంప్ చేస్తున్నారు.

స్థానిక విమానాశ్రయంలో మంత్రులు, పౌరులు, పోలీసు అధికారులపై ఆయన మద్దతుదారులు దాడికి పాల్పడిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ విశాఖపట్నం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఈస్ట్) హర్షిత చంద్ర నుండి నోటీసు అందుకున్నారు. "నా మదిలో ఇప్పుడే ఒక ఆలోచన వచ్చింది, కొంచెం స్వచ్ఛమైన గాలి తీసుకోవడానికి RK బీచ్‌లో సాయంత్రం నడకకు వెళ్ళడానికి అనుమతి ఉందా?" అంటూ ట్వీట్ చేశాడు.

పవన్‌ చేసిన ట్వీట్లతో ఆయన అభిమానులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై, పోలీసులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ఉదయం టెన్షన్

సోమవారం ఉదయం, హోటల్ వెలుపల ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేయడానికి ప్రయత్నించిన మహిళా మద్దతుదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని పోలీసులు ఆటో రిక్షాలో ఎక్కించారు

మద్దతుదారుల అరెస్టు:

పోలీసులు 71 మంది జనసేన సభ్యులను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. వారిలో 61 మంది బెయిల్‌పై విడుదల చేయగా, 9 మందిని అక్టోబర్ 28 వరకు రిమాండ్‌కు పంపారు. ముగ్గురు సభ్యులు పరారీలో ఉన్నారు. తన మద్దతుదారులను విడుదల చేసిన తర్వాతే నగరం విడిచి వెళ్లాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. జనసేన పార్టీ సభ్యుల అభిప్రాయం ప్రకారం, పవన్ కళ్యాణ్ మధ్యాహ్నంలోగా తన ప్రణాళికను ప్రకటించే అవకాశం ఉంది.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో బస చేసిన నోవాటెల్ హోటల్ వద్ద భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. పవన్‌కు సంఘీభావం తెలిపేందుకు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలివస్తారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమై హోటల్‌లోకి ఎవరూ రాకుండా అన్ని గేట్ల వద్ద బైఠాయించారు. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన ఘటనలో అరెస్ట్ అయిన జనసేన కార్యకర్తలను విడుదల చేయాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. వారంతా పవన్‌ని కలిసేందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 15న విశాఖపట్నం వచ్చిన పవన్ కళ్యాణ్ 5 రోజుల పాటు ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. అయితే విశాఖలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో జనసేనాని త్వరలో హైదరాబాద్‌కు వెళ్లనున్నారని సమాచారం.

Next Story