విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో అగ్నిప్రమాదం
Fire Accident in Vizag Steel Plant Todayవిశాఖ స్టీల్ ప్లాంట్‌లో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
By తోట వంశీ కుమార్ Published on
25 Dec 2021 3:24 AM GMT

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బ్లాస్ట్ ఫర్నేస్ ఫ్లాంట్-2లో ఈ ప్రమాదం జరిగింది. ల్యాడిల్‌కు రంధ్రం పడడంతో.. ఉక్కుద్రవం(లిక్విడ్) నేలపాలు అయ్యింది. ద్రవం కిందపడడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఫైరింజన్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే.. అప్పటికే రెండు లారీలు ఆ మంటలకు కాలి బూడిదయ్యాయి. కాగా.. ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
Next Story