విశాఖలోని హెటెరో డ్రగ్స్ పరిశ్రమలో భారీ పేలుడు
Explosion in the Hetero Industry Five workers Injured.విశాలోని హెటెరో డ్రగ్స్ కంపెనీలో బుధవారం రాత్రి పేలుడు
By తోట వంశీ కుమార్ Published on
24 Feb 2022 2:42 AM GMT

విశాలోని హెటెరో డ్రగ్స్ కంపెనీలో బుధవారం రాత్రి పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.
వివరాల్లోకి వెళితే.. నక్కపల్లి మండలంలోని రాజయ్య పేట సమీపంలోని హెటెరో డ్రగ్స్ పరిశ్రమ వద్ద డీఎంఎస్‌వో ప్లాంట్ లో బుధవారం రాత్రి పేలుడు సంభివించింది. కార్మికులు అక్కడి నుంచి భయంతో ఉరుకులు పరుగులు తీశారు. వెంటనే అధికారులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన అధికారులు ప్రమాదం తీవ్రత పెరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిని ఎ.సాయిరామ్, గోపాలకృష్ణ దాస్, గంగాధర్ సాహూ, వీర్రాజు, మహేశ్, రాజు గా గుర్తించారు. వీరిలో సాయిరాం, గంగాధర్‌ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. సాంకేతిక కారణాల వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ప్రాధమికంగా పోలీసులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై దర్యాప్తు చేపట్టారు.
Next Story