Vizag : సెల్ఫీ వీడియో క‌ల‌క‌లం.. ఆత్మ‌హ‌త్య చేసుకుంటామంటూ బంధువుల‌కు పంపి

ఆత్మ‌హ‌త్య చేసుకుంటామంటూ దంపతులు సెల్ఫీ వీడియో తీసుకుని క‌నిపించ‌కుండా పోవ‌డం క‌ల‌కలం రేపుతోంది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 March 2023 12:15 PM IST
Vizag,selfie video

మీరా, వ‌రప్రసాద్


ఆత్మ‌హ‌త్య చేసుకుంటామంటూ దంపతులు సెల్ఫీ వీడియో తీసుకుని క‌నిపించ‌కుండా పోవ‌డం క‌ల‌కలం రేపుతోంది. ఈ ఘ‌ట‌న విశాఖ‌ప‌ట్నంలో చోటు చేసుకుంది. వ‌డ్ల‌పూడి తిరుమ‌ల‌న‌గ‌ర్‌లో వరప్రసాద్(47), మీరా(41) దంప‌తులు నివాసం ఉంటున్నారు. వ‌ర‌ప్ర‌సాద్ స్టీల్‌ప్లాంట్ ఉద్యోగి. గ‌తకొద్ది రోజులుగా వీరు ఆర్థిక ఇబ్బందుల‌తో బాధ‌ప‌డుతున్నారు.

ఆర్థిక ఇబ్బందుల కార‌ణంగా ఆత్మ‌హత్య చేసుకుంటున్నామ‌ని, పిల్ల‌ల‌ను బాగా చూసుకోవాల‌ని ఓ వీడియో తీసి బంధువుల‌కు పంపి సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. ఈ వీడియోను చూసిన‌ వారి కుమారుడు కృష్ణ సాయి తేజ్ దువ్వాడ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసిన పోలీసులు వారి కోసం గాలింపు చేప‌ట్టారు.

ఈ క్ర‌మంలో అనకాపల్లి జిల్లాలోని ఏలేరు కాలువ దగ్గర దంపతుల బ్యాగు, దుస్తులు, చెప్పులు లభ్యమయ్యాయి. ప్ర‌స్తుతానికి మిస్సింగ్ కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఇంత‌కు వాళ్లు ఎక్క‌డికైనా వెళ్లిపోయారా..? ఆత్మ‌హ‌త్య చేసుకున్నారా..? అన్న కోణంలోనూ విచార‌ణ చేస్తున్నారు.

Next Story