AP: మంత్రి ఆదిమూలపు సురేశ్‌కు తప్పిన ప్రమాదం.. పారా గ్లైడింగ్ చేస్తుండగా ఒక్కసారిగా..
ఆంధ్రప్రదేశ్: రాష్ట్ర పురపాలక, పట్టణాభివఅద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌కు పెను ప్రమాదం తప్పింది.
By అంజి Published on 26 March 2023 5:09 AM GMTAP: మంత్రి ఆదిమూలపు సురేశ్‌కు తప్పిన ప్రమాదం.. పారా గ్లైడింగ్ చేస్తుండగా ఒక్కసారిగా..
ఆంధ్రప్రదేశ్: రాష్ట్ర పురపాలక, పట్టణాభివఅద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌కు పెను ప్రమాదం తప్పింది. విశాఖపట్నం పర్యటనలో ఉన్న మంత్రి సురేష్.. ఇవాళ ఉదయం ఆర్కే బీచ్‌లో పారా గ్లైడింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. విండ్ డైరెక్షన్ సహకరించకపోవడంతో మొదట్లోనే కుదుపులు చోటుచేసుకున్నాయి. దీంతో పారాగ్లైడింగ్ టేకాఫ్ సమయంలో ఇంజిన్ పక్కకు ఒరిగింది. అయితే మంత్రి వ్యక్తిగత సిబ్బంది వెంటనే అలర్ట్ కావడంతో ప్రమాదం తప్పింది. దీంతో మంత్రి సురేశ్‌తోపాటు అక్కడే ఉన్న ఇతర మంత్రులు షాక్‌కుగురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి నిర్వాహకులపై కలెక్టర్ మల్లికార్జున అసహనం వ్యక్తం చేశారు.
జీ 20 సదస్సులో భాగంగా విశాఖపట్నంలో మారథాన్, సాహస క్రీడలను నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ 5కే, 10కే మారథాన్‌ను మంత్రులు ఆదిమూలపు సురేష్, విడుదల రజనీ, గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. ఈ క్రమంలోనే నిర్వాహకులు ఆహ్వానం మేరకు మంత్రి సురేష్ పారా గ్లైడింగ్‌కు వెళ్లారు. మంత్రి విడుదల రజనీ జెండా ఊపి ఈవెంట్‌ను స్టార్ట్ చేశారు. విండ్ డైరెక్షన్ సహకరించకపోవడంతో సురేశ్ పారా గ్లైడర్ కుదుపులకు గురైంది. కాగా, మంత్రికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
ఎల్లుండి నుంచి మూడు రోజుల పాటు విశాఖపట్నం వేదికగా జీ-20 సన్నాహక సదస్సు జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై మంత్రులు విడదల రజని ఆదిమూలపు సురేష్, గుడివాడ అమర్‌నాథ్‌లు శనివారం సమీక్ష సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే.