శుభ‌వార్త‌.. విశాఖ‌లో ఎయిర్‌టెల్ 5జీ

Airtel 5G Plus Launched in Visakhapatnam.ప్ర‌ముఖ టెలికామ్ సంస్థ ఎయిర్‌టెట్ విశాఖ వాసుల‌కు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Dec 2022 5:33 AM GMT
శుభ‌వార్త‌.. విశాఖ‌లో ఎయిర్‌టెల్ 5జీ

ప్ర‌ముఖ టెలికామ్ సంస్థ ఎయిర్‌టెట్ విశాఖ వాసుల‌కు శుభ‌వార్త చెప్పింది. ఎంత‌గానో ఎద‌రుచూస్తున్న 5జీ సేవ‌ల‌ను న‌గ‌రంలో ప్రారంభించిన‌ట్లు తెలిపింది. ఇప్ప‌టికే హైద‌రాబాద్ స‌హా ప‌లు న‌గ‌రాల్లో 5జీ సేవ‌ల‌ను ప్రారంభించింది ఎయిర్‌టెల్‌. విశాఖ ఈ జాబితాలో 18వ న‌గ‌రం అని ఎయిర్‌టెల్‌ ఏపీ, తెలంగాణ సీఈవో శివన్‌ భార్గవ చెప్పారు.

ప్ర‌స్తుతం ద్వార‌కాన‌గ‌ర్‌, బీచ్ రోడ్డు, దాబా గార్డెన్స్‌, మ‌ద్దిల‌పాలెం, వాల్తేర్ అప్‌ల్యాండ్స్‌, పూర్ణా మార్కెట్‌, గాజువాక జంక్ష‌న్‌, ఎంవీపీ కాల‌నీ, రాంన‌గ‌ర్ రైల్వేస్టేష‌న్ రోడ్డు పాంత్రాల్లో ఈ సేవ‌లు ల‌భిస్తాయ‌ని, ద‌శ‌ల వారీగా న‌గ‌రం మొత్తం 5జీ సేవ‌లు అందుబాటులో తీసుకురానున్న‌ట్లు తెలిపారు. 5జీ సేవ‌ల‌ను ఉచితంగానే పొంద‌వ‌చ్చున‌న్నారు. 4జీ సేవ‌లు పొంతున్న వినియోగ‌దారులు ప్ర‌స్తుతం ఉన్న సిమ్ కార్డును మార్చ‌కుండానే ఈ సేవ‌లు పొంద‌వ‌చ్చు. అయితే.. ఇందుకోసం 5జీ స‌పోర్ట్‌తో కూడిన ఫోన్‌, మీరుంటున్న ప్రాంతంలో 5జీ నెట్‌వ‌ర్క్ ఉంటే ఫోన్ సెట్టింగ్ నెట్‌వ‌ర్క్‌లో 5జీ అని అని సెలెక్ట్ చేసుకుంటే స‌రిపోతుంది.

మీ ఫోన్ 5జీ స‌పోర్ట్ చేస్తుందా..? మీ ప్రాంతంలో 5జీ నెట్‌వ‌ర్క్ ఉందా..? అనే వివ‌రాల‌ను ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌లో సైతం తెలుసుకోవ‌చ్చు.

ఎయిర్ 5జీ సేవ‌లు అందిస్తున్న న‌గ‌రాలు ఇవే..

విశాఖపట్నం, ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, పాట్నా, గౌహతి, సిమ్లా, ఇంఫాల్, అహ్మదాబాద్, గాంధీనగర్, హైదరాబాద్, బెంగళూరు, నాగ్‌పూర్, వారణాసి, గురుగ్రామ్, సిలిగురి మరియు పానిపట్.

Next Story