చికెన్‌ బిర్యానీ తిని 13 మందికి అస్వస్థత.. రెస్టారెంట్‌పై కేసు

విశాఖపట్నంలోని గాజువాకలోని మండి క్రూడ్స్ రెస్టారెంట్‌లో చికెన్ బిర్యానీ తిని సుమారు 13 మంది యువకులు ఫుడ్ పాయిజన్‌కు గురయ్యారు.

By అంజి  Published on  11 Oct 2023 2:45 AM GMT
13 fall ill, chicken mandi biryani, Vizag

చికెన్‌ బిర్యానీ తిని 13 మందికి అస్వస్థత.. రెస్టారెంట్‌పై కేసు

విశాఖపట్నంలోని గాజువాకలోని మండి క్రూడ్స్ రెస్టారెంట్‌లో చికెన్ బిర్యానీ తిని సుమారు 13 మంది యువకులు ఫుడ్ పాయిజన్‌కు గురయ్యారు. తీవ్ర వాంతులు, కడుపునొప్పి రావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. సోమవారం రాత్రి స్థానిక పోలీసులు రెస్టారెంట్‌పై కేసులు నమోదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వినాయక చవితి సంబరాలు ముగియడంతో యువకులు పార్టీ చేసుకుందామని స్థానిక మండీ క్రూడ్ రెస్టారెంట్‌‌కు వెళ్లారు. అక్కడ మండి బిర్యానీ తిన్న వారంత వాంతులు.. విరేచనాలతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.

గాజువాక పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ ఎల్ భాస్కర్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 8న 13 మంది స్నేహితుల బృందం రెస్టారెంట్ కు వెళ్లి చికెన్ బిర్యానీ, బార్బెక్యూ చికెన్ వింగ్స్ తిన్నారు. మరుసటి రోజు ఉదయం, వారు వాంతులు, కడుపు సంబంధిత సమస్యల లక్షణాలను చూపించడం ప్రారంభించారు. వారిని ఆసుపత్రిలో చేర్చారు. వీరిలో తొమ్మిది మంది డిశ్చార్జి కాగా, నలుగురు చికిత్స పొందుతున్నారు. రెస్టారెంట్ యాజమాన్యంపై గాజువాక పోలీసులు ఐపీసీ 269, 272 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Next Story