డిసెంబర్‌ 26, 27 తేదీల్లో విశాఖ ఉత్సవ్‌..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Oct 2019 12:04 PM GMT
డిసెంబర్‌ 26, 27 తేదీల్లో విశాఖ ఉత్సవ్‌..!

విశాఖపట్నం: కలెక్టరేట్‌లో విశాఖ ఉత్సవ్‌, జిల్లా అభివృద్ధిపై అధికారులతో మంత్రి అవంతి సమీక్ష నిర్వహించారు. ఏపీ సంప్రదాయాలు, సంస్కృతికి అద్దంపట్టేలా ఎటా ప్రభుత్వం విశాఖ ఉత్సవ్‌ను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో భాగంగా 2019 సంవత్సరానికి గాను డిసెంబర్‌ 26, 27 తేదీల్లో విశాఖ ఉత్సవ్‌ను నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అలాగే నవంబర్‌ 9, 10 తేదీల్లో భీమిలి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరిలో అరకు ఉత్సవాలు నిర్వహిస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్‌ తెలిపారు. స్థానిక కళాకారులతో వైభవంగా సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర పరువు దిగజార్చేలా ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మంత్రి అవంతి మండిపడ్డారు. ఇసుక కొరతపై ప్రజలను ప్రతిపక్షాలు తప్పుదారి పట్టిస్తున్నాయని ఆరోపించారు. మద్యపాన నిషేధానికి టీడీపీ అనుకూలమో.. కాదో చెప్పాలన్నారు. అమ్మ ఒడి పథకాన్ని విపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో సమాధానం చెప్పాలని మంత్రి అవంతి శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు.

Next Story
Share it