విశాఖ మృతుల వివరాలు

By సుభాష్  Published on  7 May 2020 2:07 PM IST
విశాఖ మృతుల వివరాలు

విశాఖ ఎల్‌జీ పరిశ్రమలో గ్యాస్‌ లీకేజీపై తీవ్ర అస్వస్థతకు గురైన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన వారి వివరాలు..

కుందన శ్రేయ (6), ఎన్.గ్రీష్మ (9), చంద్రమౌళి (19), గంగాధర్, నారాయణమ్మ (35), అప్పల నరసమ్మ (45), గంగరాజు (48), మేకా కృష్ణ మూర్తి (73)తో పాటు మరో వ్యక్తి మృతి చెందినట్లు అధికారులు వివరించారు. మృతుడు చంద్రమౌళి విశాఖ పట్నంలోని ఏఎంసీలో ఎంబీబీఎస్ తొలి ఏడాదిలో చేరి చదువుకుంటున్నాడు. గ్యాస్ లీకైన ప్రాంతాల్లో ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు విడిచాడు.

మృతుల్లో కొందరు రోడ్డుపైనే మృతి చెందగా, మరికొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, ఏపీ సీఎం జగన్ పర్యటన అనంతరం ఈ ఘటనపై మరిన్ని వివరాలు వెల్లడిస్తామని సంబంధిత అధికారులు మీడియాకు తెలిపారు.

కాగా, పరిసర ప్రాంతాల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు వెళ్లివాలని అధికారులు సూచిస్తున్నారు. దీంతో చుట్టుపక్కల ఉన్నవారు పరుగులు తీస్తున్నారు. కాగా, ప్రస్తుతానికి గ్యాస్‌ లీక్‌ ఆగిపోయిందని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ప్రకటించిన కొద్దిసేపటికే మరోసారి గ్యాస్‌ లీక్‌ కావడం ఆందోళన కలిగిస్తోంది. మనుషులే కాకుండా మూగజీవాలు సైతం మృత్యువాత పడుతున్నాయి. తీవ్ర అస్వస్థతకు గురైన వారు దీర్ఘకాలికంగా బాధపడే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Next Story