విశాఖ: స్టైరెన్ దెబ్బ‌కు వాడిన ప‌సిమొగ్గ‌లు

By సుభాష్  Published on  7 May 2020 6:01 AM GMT
విశాఖ: స్టైరెన్ దెబ్బ‌కు వాడిన ప‌సిమొగ్గ‌లు

విశాఖలోని ఎల్జీ పాలిమర్స్‌ రసాయన వాయువు లీకేజీ ఘటన రాష్ట్ర మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కంపెనీ నుంచి వెలువడిన విష వాయువుల కారణంగా ఇప్పటి వరకూ 10 మృతి చెందగా, చాలా మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విష వాయువు ఐదు కిలోమీటర్ల మే వ్యాపించింది. పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామాలను సైతం ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పరిశ్రమ నుంచి లీకైన స్టైరీన్ గ్యాస్ కారణంగా కళ్లల్లో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో ఎదుర్కొంటున్నారు. ఇక చిన్న పిల్లలు సైతం స్టైరీన్ గ్యాస్‌ దెబ్బకు మృత్యువాత పడుతున్నారు. పెద్దలకంటే పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్‌ తక్కువ ఉండటం చేత కూడా వారు ఇలాంటి ఘటనలకు త్వరగా దెబ్బతినే అవకాశం ఉందని తెలుస్తోంది.

అయితే పీవీసీ గ్యాస్‌ను అన్ని ప్లాస్టిక్‌ వస్తువల తయారీలో ఉపయోగిస్తారు. పీవీసీ లేకుండా ఏ ప్లాస్టిక్‌ను కూడా తయారు చేయలేదు. ప్లాస్టిక్‌ను తయారు చేసే క్రమంలో పాలీవినైల్‌ క్లోరైడ్‌లోని క్లోరిన్‌ వాయువు లీకయినట్లయితే అత్యంత ప్రమాదకరమనే చెప్పాలి. ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమలో అదే జరిగింది.

ఈ పరిశ్రమ నుంచి అత్యంత ప్రమాదకరమైన క్లోరిన్‌ వాయువు లీకైంది. ఇందులో అధిక గాఢత కలిగి ఉండటం వల్ల ఆ వాయువును పీల్చిన వెంటనే ఊపిరితిత్తులపై నేరుగా ప్రభావం చూపుతుంది. దీంతో శ్వాస సంబంధ సమస్యలు తలెత్తుతాయి. ఈ వాయువు వాతావరణంలోని ఆక్సిజన్‌తో కలిసి డయాక్సిన్స్‌ను ఏర్పాటు చేసి అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. ఈ గాలి పీల్చిన వెంటనే మనుషులతో పాటు మూగ జీవాలు సైతం అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయే అవకాశం ఉంది. అంతేకాని చనిపోవడం కూడా జరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. చెట్లు కూడా మాడిపోడమే కాకుండా మనం ధరించే దుస్తులు కూడా పసుపు రంగులోకి మారుతాయి.అంతేకాదు పాలీవినైల్‌ క్లోరైడ్‌లోని క్లోరిన్‌ క్యాన్సర్‌కు కారణం అవుతుందని చెబుతున్నారు.

Next Story