నడిరోడ్డుపై పోలీసును చెప్పుతో కొట్టిన మహిళ, వీడియో వైరల్

ఓ ఈ-రిక్షా మహిళా డ్రైవర్‌ నెంబర్‌ ప్లేట్‌ లేకుండా రోడ్డుమీదకు వచ్చింది. అడ్డుకున్న పోలీసుపై చెప్పుతో దాడి చేసింది.

By Srikanth Gundamalla  Published on  12 Oct 2023 11:10 AM IST
Woman, Beat traffic police,  uttar pradesh, viral video,

నడిరోడ్డుపై పోలీసును చెప్పుతో కొట్టిన మహిళ, వీడియో వైరల్

పోలీసులు వాహనాదారులను అడ్డుకున్నప్పుడు కొందరు ఎలాగైనా తప్పించుకునేందుకు ఏవేవో మాటలు చెప్తుంటారు. అన్ని పత్రాలు ఉంటే చూపించి వెళ్లిపోయే వారు కొందరు ఉంటే.. సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడిపేవారు మాత్రం కొందరు రకరకాల వేషాలు వేసి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తారు. అయితే.. ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఓ ఈ-రిక్షా మహిళా డ్రైవర్‌ నెంబర్‌ ప్లేట్‌ లేకుండా రోడ్డుమీదకు వచ్చింది. అది గమనించిన ట్రాఫిక్‌ పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. దాంతో.. ఆమె ఆగ్రహావేశంతో ఊగిపోయింది. ఏకంగా పోలీసునే చెప్పుతో కొట్టింది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో మంగళవారం చోటుచేసుకుంది ఈ సంఘటన. మిథిలేష్‌ అనే మహిళ ఈ-రిక్షా డ్రైవర్. అయితే.. ఆమె తన వాహనానికి నెంబర్‌ ప్లేట్‌ వేయించుకోలేదు. అలాగే రోడ్లపై యథేచ్చగా తిరుగుతోంది. అయితే.. ఈ విషయం గమనించిన ట్రాఫిక్‌ పోలీసులు ఆమెను అపారు. బండి పక్కనపెట్టమని చెప్పారు. అయితే.. పోలీసులు ఆమెను ఇలా తిరగొద్దని.. నేరంగా పరిగణించాల్సి వస్తుందని చెప్పారు. దాంతో.. సదురు మహిళ ఆగ్రహానికి గురైంది. ట్రాఫిక్‌ పోలీసుతో వాగ్వాదానికి దిగింది. ఆపై కోపం పట్టలేక దాడి చేసింది. అంతటితో ఆగకుండా చెప్పు తీసుకుని కొడుతూ.. అసభ్యపదజాలంతో తీవ్రంగా తిట్టింది. అయితే.. సదురు మహిళను మరో పోలీసు అధికారి అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆమె ఏమాత్రం వినలేదు. అతడిని కూడా రోడ్డుపై పడదోసి అక్కడి నుంచి వెళ్లిపోయింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహిళా డ్రైవర్‌ తీరును నెటిజన్లు తప్పుబడుతున్నారు. కాగా.. బాధిత పోలీసు అధికారులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడంతో.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ తర్వాత ఈ రిక్షా మహిళా డ్రైవర్‌ మిథిలేష్‌ను అరెస్ట్‌ చేశారు. ఆమె పట్టరాని కోపమే కటకటకాల పాలు చేసిందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. రూల్స్ పాటించాలని.. అలాగే డ్యూటిలో ఉన్న అధికారుల పట్ల గౌరవంగా నడుచుకోవాలంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

Next Story