ఈ రోజుల్లో పెళ్లిళ్లు అంత సింపుల్‌గా జరగడం లేదు. వినూత్నంగా వధూవరుల ఎంట్రీలతో పాటు పెళ్లి కార్డుల నుంచి.. పెళ్లి అయిపోయే వరకు ఏదో సందర్భంలో ఏదైనా కొత్తగా ఉండేలా చూస్తున్నారు. అయినా హఠాత్తుగా దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నామో మీరు ఆలోచిస్తున్నారా..?.. అయితే ఉత్తర్‌పర్దేశ్‌లోని అమ్రోహాలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో వింత సంఘటన గురించి మీరు తెలుసుకోవాలి. పెళ్లిన వచ్చిన అతిథులు వేదికలోకి ప్రవేశించే ముందు వారి ఆధార్ కార్డులను చూపించి లోపలికి రావాలంటూ ప్రకటన చేశారు. అవును, మీరు చదివింది నిజమే. దీనికి సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.
ఈ వింత ఘటన అమ్రోహాలోని హసన్‌పూర్‌లో చోటుచేసుకుంది. వేదిక వద్దకు వచ్చిన వివాహ అతిథుల బృందాన్ని చూసి వధువు తరఫు వారు కాస్త ఆందోళనకు గురయ్యారు. అంతమందికీ సరిపడా భోజన ఏర్పాట్లు చేయడంలో వధువు తరఫు వాళ్లు విఫలమయ్యారు. దీంతో పెళ్లి వేదికలోకి ప్రవేశించే ముందు అతిథులు తమ ఆధార్ కార్డులను చూపించాలని వారు కోరారు. రుజువు చూపించగలిగిన వ్యక్తులు ప్రవేశించవలసి ఉంటుందని చెప్పారు. చూపించగలిగిన వాళ్ళు భోజనం చేయగలరు. మిగతా వాళ్లు ఇదేం అవమానం అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనిని అక్కడున్న వ్యక్తులు వీడియోను రికార్డ్ చేశారు.