విమానం సీలింగ్ నుంచి లీకైన నీరు.. వీడియో వైరల్

విమాన ప్రయాణం అంటే ఎంత కాస్ట్‌లీయో అందరికీ తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  30 Nov 2023 3:56 PM IST
water leak,  air india, flight, viral video,

విమానం సీలింగ్ నుంచి లీకైన నీరు.. వీడియో వైరల్

విమాన ప్రయాణం అంటే ఎంత కాస్ట్‌లీయో అందరికీ తెలిసిందే. సుదూర ప్రయాణాలను కేవలం కొద్ది గంటల్లోనే చేరుకోవచ్చు. అయితే.. కాస్ట్‌కు తగినట్లుగానే విమాన ప్రయాణాల్లో సౌకర్యాలూ ఉంటాయి. కానీ.. ఎక్కడో ఒక్క చోట మాత్రమే సదుపాయాలు అంతగా ఉండవు. తాజాగా ఎయిరిండియా విమానంలో ప్రయాణికులకు ఇబ్బందికర అనుభవం ఎదురైంది. విమానం సీలింగ్ నుంచి వాటర్‌ లీక్‌ అయ్యాయి. దాంతో.. ప్రయాణికులు ఇబ్బందులు పడక తప్పలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తాజాగా ఢిల్లీ నుంచి లండన్‌ వెళ్లిన ఎయిరిండియా విమానంలో ఈ సంఘటన జరిగింది. విమానం పైభాగం నుంచి నీరు ధారగా కారింది. ఓవర్‌ హెడ్‌ బిన్‌ల నుంచి నీరు లీక్‌ అవతూనే ఉండింది. దాంతో.. విమాన ప్రయాణికులు ఇబ్బందులుపడాల్సి వచ్చించి. నీరు కారుతున్న సీట్లలో ఉన్న వారు మరో చోట కూర్చొని ఇబ్బందికరంగానే ప్రయాణం చేశారు. అయితే.. నీరు లీకేజీని నివారించేందుకు సిబ్బంది ప్రయత్నించారు. కానీ పూర్తిస్థాయిలో దాన్ని ఆపలేకపోయారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అసలు వాటర్ లీకేజ్‌కు గల కారణాలు ఏంటనేది తెలియలేదు.

ఈ ఘటనపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతూనే ఉంది. ఇలాంటి సాధరణమేనని కొందరు ఈజీగా తీసుకుంటున్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తుతాయని వదిలేయాలని అంటున్నారు. ఇంకొందరు మాత్రం విమానాల నిర్వహణలో లోపాలను అస్సలు సహించొద్దని చెబుతున్నారు. సాంకేతిక సమస్య మరింత పెద్దదిగా మారితే పెను ప్రమాదాలు జరిగే అవకాశాలు లేకపోలేదని హెచ్చరించారు. దీనిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాల్సిందే అని కామెంట్స్ పెడుతున్నారు.

Next Story