లండన్‌లోని ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ఇస్కాన్) గోవింద రెస్టారెంట్ పూర్తిగా శాఖాహార సంస్థ అయినప్పటికీ, లోపల ఒక వ్యక్తి కావాలనే వెళ్లి చికెన్ తింటున్న వీడియో ఆన్‌లైన్‌లో విస్తృత ఆగ్రహాన్ని రేకెత్తించింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోలో ఆఫ్రికన్-బ్రిటిష్ సంతతికి చెందిన వ్యక్తి, ఇస్కాన్ యొక్క ప్రసిద్ధ శాఖాహార రెస్టారెంట్ గోవింద ప్రాంగణంలోకి ప్రవేశించి ఈ పని చేశారు.
మాంసం, ఉల్లిపాయలు, వెల్లుల్లితో ఆహారం అందుబాటులో లేవని సిబ్బంది సమాచారం ఇచ్చారు. ఇంతలో అతను KFC చికెన్ బకెట్ తీసి రెస్టారెంట్ లోపల తినడం ప్రారంభించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఓ వైపు రెస్టారెంట్ నిర్వాహకులు షాక్ అవ్వగా, అక్కడే ఉన్న ఓ కస్టమర్ ఇది ఇక్కడి నియమ నిబంధనలకు విరుద్దమని అతడికి చెప్పడానికి ప్రయత్నించారు.