పెళ్లిలో కొట్టుకున్నారు.. కార‌ణం తెలిస్తే మైండ్ బ్లాకే

Violent clashes in Baghpat wedding.ఇళ్లు క‌ట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు పెద్ద‌లు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Feb 2023 12:35 PM IST
పెళ్లిలో కొట్టుకున్నారు.. కార‌ణం తెలిస్తే మైండ్ బ్లాకే

ఇళ్లు క‌ట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు పెద్ద‌లు. టెక్నాల‌జీ పెరిగిపోవ‌డంతో డ‌బ్బులు ఉంటే ఇళ్లు త్వ‌ర‌గా క‌ట్టించుకోవ‌చ్చు గానీ ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఎలాంటి గొడ‌వ‌లు లేకుండా పెళ్లి చేయ‌డం కూడా క‌ష్ట‌మైన ప‌నే. క‌ట్నం ఇవ్వ‌లేద‌నో, మాంసాహారం వ‌డ్డించ‌లేద‌నో, మ‌ర్యాద‌లు స‌రిగ్గా చేయ‌లేద‌నో విష‌యాల్లో గొడ‌వ‌లు జ‌రిగిన ఘ‌ట‌న‌లు మ‌నం చూశాం. ఇక్క‌డ వ‌రుడు, వ‌ధువు కుటుంబాలు గొడ‌వ ప‌డ్డాయి. వివాదం పెద్ద‌ది కావ‌డంతో క‌ర్ర‌ల‌తో ఒక‌రినొక‌రు కొట్టుకున్నారు. ఇంత‌కు వీరి మ‌ధ్య పంచాయ‌తీ గ‌ల కార‌ణం ఏంట‌నేది తెలిస్తే మ‌న మైండ్ బ్లాక్ అవ్వ‌డం ఖాయం. వివాహ విందులో ప‌న్నీరు పెట్ట‌లేద‌ని కొట్టుకున్నారు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

బాగ్‌ప‌త్ జిల్లాలో ఓ వివాహా వేడుక జ‌రుగుతోంది. అక్క‌డ అంతా కోలాహ‌లంగా ఉంది. విందు ప్రారంభ‌మైంది. అయితే.. వ‌రుడి మేన‌మామకి విందులో ప‌న్నీరు వ‌డ్డించ‌లేదు. దీంతో చిన్న‌గా మొద‌లైన గొడ‌వ కాస్త పెద్ద‌దిగా మారింది. ఇరు వ‌ర్గాలు ఒక‌రిపై మ‌రొక‌రు క‌ర్ర‌లు, బెల్టుల‌తో దాడుల‌కు దిగారు. దీనిపై స‌మాచారం అందుకున్న పోలీసులు అక్క‌డ‌కు చేరుకున్నారు. త‌మ లాఠీల‌కు ప‌ని చెబితే గాని అక్క‌డి ప‌రిస్థితి అదుపులోకి రాలేదు.

ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ప‌న్నీరు కోసం ఇంత‌లా కొట్టుకోవాలా అంటూ నెటీజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.

Next Story