Video: గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్‌లో పాము.. భయంతో ప్రయాణికుల పరుగులు

కదులుతున్న రైలులో బెర్త్ పైభాగంలో ఉన్న ఇనుప కడ్డీ చుట్టూ పొడవాటి పాము చుట్టుముట్టడం చూసి ప్రయాణికులు షాక్ అయ్యారు.

By అంజి
Published on : 23 Sept 2024 10:00 AM IST

viral video, Snake In A Train, Mumbai, Passengers, Garib Rath Express

Video: గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్‌లో పాము.. భయంతో ప్రయాణికుల పరుగులు

కదులుతున్న రైలులో బెర్త్ పైభాగంలో ఉన్న ఇనుప కడ్డీ చుట్టూ పొడవాటి పాము చుట్టుముట్టడం చూసి ప్రయాణికులు షాక్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌ నుంచి ముంబై వెళ్తున్న గరీబ్‌రథ్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లలో ఒకదానిలో పాము బుసలు కొట్టడం చూసి ఒక ప్రయాణికుడు ఇతరులను అప్రమత్తం చేయడంతో భయాందోళనలు వ్యాపించాయి. రైల్వే అధికారులకు సమాచారం అందించారు.

రైలు జబల్‌పూర్ నుంచి ముంబైకి వెళ్తుండగా జీ3 కోచ్‌లోని పై బెర్త్ (23)పై పాము కనిపించింది. రైలు సిబ్బంది సత్వరమే స్పందించి పరిస్థితిని అదుపు చేసి ప్రయాణికులను సురక్షితంగా ఉంచారు. పాము కనిపించడంతో ప్రయాణికులను మరో కోచ్‌లోకి తరలించారు. తర్వాత ఆ కోచ్‌ను వేరు చేసి, రైలును తిరిగి జబల్‌పూర్‌కు పంపారు. పశ్చిమ మధ్య రైల్వే చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ హర్షిత్‌ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ఈ ఘటనను గుర్తించామని, దర్యాప్తు చేస్తామని చెప్పారు. ప్రయాణీకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, రైల్వే ఇలాంటి విషయాలను సీరియస్‌గా తీసుకుంటుందని ఆయన చెప్పారు.

Next Story