ఆ జంటకు కుండపోత వర్షం కూడా పెద్ద సమస్యగా అనిపించలేదు. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా.. వర్షంలోనే ఆ జంట ఏడడుగులు వేశారు. పూజారి కూడా వర్షానికి దూరంగా ఉండి మంత్రాలు చదివారు. ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అదే సమయంలో పెళ్లి పెట్టుకున్న ఓ జంట.. వర్షంలోనే పెళ్లి చేసుకున్నారు. పెళ్లి వేడుక కోసం ఇంటి ముందు మండపం ఏర్పాటు చేశారు. ఇంతలో వర్షం కురవడంతో మండపంలోకి నీళ్లు రావడం మొదలైంది.
దీంతో పూజారితో పాటు పెళ్లి చూడటానికి వచ్చిన బంధువులు ఇంట్లోకి పరుగులు తీశారు. కానీ ముహుర్తం దగ్గర పడుతుండటం ఆ జంట మంత్రం అక్కడి నుంచి కదల్లేదు. వరండాలో కూర్చొని పూజారి మంత్రాలు చదువుతుండగా.. ఆ కొత్త జంట ఏడడుగులు వేసింది. భార్య ముందు నడుస్తుండగా.. భర్త ఓ చేతితో భార్య వేలిని, మరో చేతితో గొడుడు పట్టుకుని.. ఆమె అడుగులో అడుగు వేశాడు. పెళ్లికి వచ్చిన వారు.. పెళ్లి వీడియోను తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో వీడియో నెట్టింట బాగా వైరల్‌గా మారింది. దీంతో ఈ వీడియోకు నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.