భార్యను ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేసిన భర్త, అలా చేయడంతో కన్నీళ్లు పెట్టుకుని..
ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్ జిల్లాలో ఎవరూ ఊహించని ఘటన ఒకటి జరిగింది.
By Knakam Karthik
భార్యను ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేసిన భర్త, అలా చేయడంతో కన్నీళ్లు పెట్టుకుని..
ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్ జిల్లాలో ఎవరూ ఊహించని ఘటన ఒకటి జరిగింది. ఒక భర్త తన భార్యకు మళ్లీ పెళ్లి చేశాడు. తన భార్య వివాహేతర సంబంధాన్ని అంగీకరించడమే కాకుండా, వారి ఇద్దరు పిల్లల బాధ్యతను తానే స్వయంగా తీసుకున్నాడు. తన పనుల కారణంగా, బబ్లూ తరచుగా భార్యకు దూరంగా ఉండేవాడు. ఆ సమయంలో అతని భార్య రాధిక స్థానిక యువకుడైన వికాస్‌తో సంబంధాన్ని పెంచుకుంది. ఈ వార్త యూపీలో హట్ టాపిక్‌గా మారింది.
కటర్ జూట్ గ్రామానికి చెందిన బబ్లూ 2017లో గోరఖ్‌పూర్‌కు చెందిన రాధికను వివాహం చేసుకున్నాడు. వీరికి ఆర్యన్ (7), శివానీ (2) ఇద్దరు పిల్లలు. ఉద్యోగ రీత్యా బబ్లూ నిత్యం కుటుంబానికి దూరంగా ఉండేవాడు. ఈ క్రమంలో స్థానిక యువకుడు వికాస్‌తో రాధికకు ఏర్పడిన పరిచయం వివాహేతర బంధానికి దారి తీసింది. వీరి రహస్య బంధాన్ని గమనించిన బబ్లూ కోపంతో ఊగిపోవడానికి బదులు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. భార్యను ధనఘ్ట తహశీల్‌కు తీసుకెళ్లి అఫిడవిట్ తయారు చేయించాడు. ఆ తర్వాత దనీనాథ్ శివాలయంలో వికాస్‌తో తన భార్య వివాహాన్ని దగ్గరుండి జరిపించాడు. అంతేకాదు, పిల్లల బాధ్యతను తాను చూసుకుంటానని, ఆమె సంతోషంగా ఉంటే చాలని చెప్పాడు.
అయితే వికాస్‌తో దండలు మార్చుకుంటున్న సమయంలో రాధిక కన్నీళ్లు పెట్టుకుంది. ఈ వివాహానికి గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. భార్య సంతోషం కోసం బబ్లూ చేసిన త్యాగాన్ని కొందరు ప్రశంసిస్తుంటే, మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు. ఇదేం పిచ్చిపని అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పెళ్లి వీడియో సోషల్ మీడియాకెక్కి వైరల్ కాగా, దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.