యూపీలో పోకిరీల ఆగడాలు, వరదలో జంటపై నీళ్లు చల్లి వికృతానందం
ఉత్తర్ ప్రదేశ్‌లో పోకిరీలు రెచ్చిపోయి ప్రవర్తించారు.
By Srikanth Gundamalla
యూపీలో పోకిరీల ఆగడాలు, వరదలో జంటపై నీళ్లు చల్లి వికృతానందం
ఉత్తర్ ప్రదేశ్‌లో పోకిరీలు రెచ్చిపోయి ప్రవర్తించారు. వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇక నగరాల్లో రోడ్లపై కూడా వరద ప్రవహిస్తోంది. లక్నోలో వర్షం కారణంగా రోడ్లపైకి నీరు వచ్చి చేరింది. ఇక ఈ నీటిలోకి కొందరు స్థానిక యువత వచ్చి ఆడుతూ హంగామా చేశారు. అంతటితో ఆగలేదు. రోడ్డుపై వెళ్తున్న వారి పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ హల్ చల్ చేశారు. తాజ్ హోటల్ వంతెన కింద జరిగిన ఈ ఘటనలో బైక్‌పై వస్తున్న ఓ జంటపై నీళ్లను చల్లారు. చేతితో బైక్‌పైకి నీళ్లను చల్లుతూ ముందుకు వెళ్లకుండా ఇబ్బంది పెట్టారు. దాంతో.. వారు ఇబ్బంది పడ్డారు. అంతేకాదు.. మరికొందరు యువకులు వెనకాల నుంచి బైక్‌ను లాగారు. దాంతో.. ఆ బైక్‌పై ఉన్నవారు కిందపడిపోయారు.
అక్కడే ఉన్న కొందరు దీన్ని వీడియో రికార్డు చేసి నెట్టింట అప్‌లోడ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యువత పిచ్చి పరాకాష్టకు చేరుతోందని వ్యాఖ్యానించారు. మహిళ ఉందని కూడా చూడకుండా ఇలా ప్రవర్తిస్తున్నారేంటి అంటూ నెటిజన్లు మండిపడ్డారు. ఇక అల్లరి మూకలను స్థానికులు కొందరు చెదరగొట్టారు. వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనిపై చివరకు పోలీసులు స్పందించారు. కేసు నమోదు చేశారు. నిందితులను గుర్తించే పనిలో పడ్డారు.
వైరల్ వీడియో
— Telugu Scribe (@TeluguScribe) July 31, 2024
ఉత్తరప్రదేశ్ - లక్నోలో బైక్‌పై వెళ్తున్న వారిపై నీళ్లు చల్లుతూ ఇబ్బంది పెట్టిన ఆకతాయిలు.. pic.twitter.com/Vh9Q3qDyMP