UP: బాక్స్‌లో నాన్-వెజ్ తెచ్చాడని నర్సరీ విద్యార్థిని సస్పెండ్ చేసిన ప్రిన్సిపాల్
లంచ్ బాక్స్‌లో మాంసాహారాన్ని తీసుకువచ్చినందుకు నర్సరీ విద్యార్థిని సస్పెండ్ చేశారు.
By Srikanth Gundamalla Published on 6 Sept 2024 10:30 AM ISTఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో లంచ్ బాక్స్‌లో మాంసాహారాన్ని తీసుకువచ్చినందుకు నర్సరీ విద్యార్థిని సస్పెండ్ చేశారు ఆ స్కూల్ ప్రిన్సిపాల్. విద్యార్థి తల్లి చిత్రీకరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో ప్రిన్సిపాల్‌కి, చిన్నారి తల్లికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
"మా గుడిని కూల్చివేసి నాన్‌వెజ్‌ని స్కూల్‌కి తెప్పించే ఇలాంటి నీతులు పిల్లలకు నేర్పడం మాకు ఇష్టం లేదు" అని ప్రిన్సిపాల్ ఒక విద్యార్థి తల్లితో చెప్పడం వీడియోలో వినబడుతోంది. బాలుడు అందరికీ నాన్ వెజ్ తినిపించాలని, వారిని ఇస్లాంలోకి మార్చాలని మాట్లాడాడని ఆరోపించారు. ప్రిన్సిపాల్ ఆరోపణలను మహిళ తోసిపుచ్చింది. తన కొడుకు లాంటి 7 ఏళ్ల బాలుడు అలాంటి విషయాల గురించి మాట్లాడలేడని చెప్పింది. దానికి ప్రిన్సిపాల్ పిల్లవాడు తన తల్లిదండ్రులు నేర్పించినవన్నీ ఇంట్లోనే నేర్చుకుంటాడని మరోసారి వ్యాఖ్యానించాడు.
ఇతర విద్యార్థుల తల్లిదండ్రులకు సమస్య ఉన్నందున పాఠశాల రిజిస్టర్ నుండి విద్యార్థి పేరును తొలగించినట్లు ప్రిన్సిపాల్ చెప్పారు. దేశంలోని హిందూ-ముస్లిం సమస్యలపై పాఠశాలలో విద్యార్థులు వాదించుకుంటున్నారని పిల్లల తల్లి కూడా ప్రిన్సిపాల్ వాదనలకు బదులిచ్చింది. మరో చిన్నారి తన కుమారుడిని కొట్టి తరచూ ఇబ్బంది పెడుతోందని ఆ మహిళ ఆరోపించింది. దీనిపై ప్రిన్సిపల్ మాట్లాడుతూ... ఆ మహిళ మరో విద్యార్థిపై ఆరోపణలు గుప్పించి పాఠశాలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందన్నారు.
దాదాపు 7 నిమిషాల నిడివి గల వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ కావడంపై విద్యాశాఖ అధికారులు స్పందించారు. అమ్రోహా పోలీసులు, డిస్ట్రిక్ట్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ (డిఐఎస్) చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ విషయంలో దర్యాప్తు చేసి తదుపరి చర్య తీసుకోవడానికి ముగ్గురు సభ్యుల విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
The principal of a private school in #UttarPradesh's #Amroha suspended a nursery student, allegedly for bringing non-vegetarian food in his lunch box to school. The incident came to light after a video, shot by the student's mother, went viral on social media.
— Hate Detector 🔍 (@HateDetectors) September 5, 2024
The video showed a… pic.twitter.com/J3D0ycd3gR