యువతి బర్త్‌డే వేడుకలు.. సడెన్‌గా పోలీసుల ఎంట్రీ.. ఆ తర్వాత..

ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఓ యువతి బర్త్‌డే వేడుకలు చేసుకుంది.

By Srikanth Gundamalla  Published on  27 May 2024 5:26 PM IST
Uttar Pradesh, police,  birthday party,  viral video,

యువతి బర్త్‌డే వేడుకలు.. సడెన్‌గా పోలీసుల ఎంట్రీ.. ఆ తర్వాత..

ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఓ యువతి బర్త్‌డే వేడుకలు చేసుకుంది. ఇంట్లోనే బర్త్‌డే పార్టీకి ప్లాన్‌ చేసుకుంది. స్నేహితులు, బంధువులు బాగానే వచ్చారు. అర్ధరాత్రి సమయం అవ్వగానే కేక్‌ తెచ్చిన ఫ్రెండ్స్‌ కట్‌ చేయించాలని చూశారు. అంతే.. అప్పుడే పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఒకరి తర్వాత మరొకరు పోలీసులు దాదాపు ఒక పది మంది వరకు ఇంట్లోకి వచ్చేశారు. వారిని చూసిన బర్త్‌డే చేసుకుంటున్న యువతితో పాటు.. మిగతా వారు కంగారు పడ్డారు.

అసలు ఏం జరిగిందంటే.. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఔరయ్యాలో అర్ధరాత్రి పోలీసు బృందం పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. అయితే.. ఒక ఇంటి బయట బాగా హడావుడి కనిపించింది. చాలా వాహనాలు నిలిచిపోయి ఉండటంతో.. ఏం జరిగిందో అని పోలీసులు తమ వాహనాన్ని నిలిపి వెళ్లి చూశారు. ఈ సంఘటన మే 26వ తేదీ అర్ధరాత్రి జరిగింది. కొత్వాలి పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌చార్జ్‌ రాజ్‌కుమార్‌ సింగ్ తన పోలీసులతో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా వాహనాలను చూశారు. ఇక పోలీసులు ఇంట్లోకి వెళ్లి చూడగా.. అక్కడున్నవారు ఒక్కసారిగా కంగారుపడ్డారు.

వెంటనే స్పందించిన పోలీసులు ఏమీ భయపడొద్దని తాము పెట్రోలింగ్‌లో ఉన్నామని చెప్పారు. బర్త్‌డే చేసుకుంటున్న యువతికి పోలీసులు శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత కేక్‌ కట్‌ చేయించి.. పార్టీలో వారూ పాల్గొన్నారు. ఇక ఈ సంఘటనపై కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. ఒక్కసారిగా పోలీసులు రాడవంతో భయపడ్డామని చెప్పారు. పోలీసులు అడగ్గానే పుట్టిన రోజు గురించి చెప్పామని అన్నారు. ఇక ఎస్‌హెచ్‌వో స్వయంగా కేక్‌ను తెప్పించి పుట్టిన రోజు ఘనంగా జరిపించారని యువతి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల తాము ఆనందంగా ఉన్నామన్నారు. ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అంటే ఇదే అంటున్నారు.

Next Story