Video: పాముకాటుతో మరణించిన వ్యక్తి.. పునరుజ్జీవం కోసం మృతదేహాన్ని గంగలో ముంచి..

ఉత్తరప్రదేశ్‌లో ఇరవై ఏళ్ల యువకుడి విషాద మరణం.. భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో మూఢనమ్మకాలను మరోసారి హైలెట్‌ చేసింది.

By అంజి  Published on  2 May 2024 12:52 PM GMT
Uttar Pradesh,  snakebite,Ganga, river

Video: పాముకాటుతో మరణించిన వ్యక్తి.. పునరుజ్జీవం కోసం మృతదేహాన్ని గంగలో ముంచి..

ఉత్తరప్రదేశ్‌లో ఇరవై ఏళ్ల యువకుడి విషాద మరణం.. భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో మూఢనమ్మకాలను మరోసారి హైలెట్‌ చేసింది. పాము కాటువేయడంతో అతన్ని నదిలో ఉంచారు. అతనిని ప్రవహించే నీటిలో ఉంచడం వల్ల పాము విషం తొలగిపోతుందని అతని కుటుంబానికి ఎవరో చెప్పారట.

బులంద్‌షహర్‌లోని అనుప్‌షహర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జైరాంపూర్ కుడేనా గ్రామానికి చెందిన మోహిత్ కుమార్, ఏప్రిల్ 26న రెండో దశ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. సాయంత్రం పార్కుకు వెళ్లాడు. అక్కడ అతడు పాము కాటుకు గురయ్యాడు. వైద్య సహాయం కోసం అతని కుటుంబ సభ్యులు ప్రయత్నించినప్పటికీ, కుమార్ చికిత్స సమయంలో విషం కారణంగా విషాదకరంగా మరణించాడు.

అయితే వైద్య తీర్పును అంగీకరించకుండా, కుమార్ కుటుంబం అతనిని రక్షించాలనే తీవ్ర ప్రయత్నంలో మూఢనమ్మకాలను ఆశ్రయించింది. గంగా నదికి విషాన్ని తొలగించే శక్తి ఉందనే స్థానిక మూఢనమ్మకాన్ని నమ్మి, కుమార్ కుటుంబం అతని మృతదేహాన్ని పవిత్ర జలాల్లో ముంచేందుకు తీవ్ర చర్య తీసుకుంది. కుమార్‌ను బతికించాలని గంగలో ముంచిన సమయంలో.. చాలా మంది ప్రజలు గంగా ఒడ్డున గుమిగూడారు.

సోషల్‌ మీడియాలో వైరలవుతున్న వీడియోలు.. కుమార్ మృతదేహాన్ని రెయిలింగ్‌కు కట్టివేసినట్లు చూపిస్తుంది, చూపరులు అతడు బతికి వస్తాడా లేదా? అని ఆత్రుతగా వేచి ఉన్నారు. అయితే, అతని ప్రాణ పునరుద్ధరణపై ఎటువంటి ఆశ లేదని తేలినప్పుడు, కుమార్ కుటుంబం అతని అంత్యక్రియలను కొనసాగించింది. గంగా ఘాట్ (నదీతీరం) వద్ద అతనిని దహనం చేసింది.

Next Story