Viral Video: ఖరీదైన కారులో వచ్చి పూల కుండీల దొంగతనం

ఇంటి బయట ఉంచిన పూల కుండీలను ఇద్దరు మహిళలు కారులో వచ్చి దొంగిలిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

By అంజి  Published on  15 Nov 2023 11:16 AM IST
Viral news, flower pots, Mohali, stealing flower pots

Viral Video: ఖరీదైన కారులో వచ్చి పూల కుండీల దొంగతనం

పంజాబ్‌ రాష్ట్రంలోని మొహాలీలోని ఓ ఇంటి బయట ఉంచిన పూల కుండీలను ఇద్దరు మహిళలు కారులో వచ్చి దొంగిలిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మొహాలీలోని సెక్టార్ 78లోని ఓ ఇంటి బయట మహిళలు తమ కారును ఆపి, అక్కడున్న పూల కుండీలను దొంగిలించారు. అయితే విచిత్రం ఏమిటంటే ఆ ఇద్దరు మహిళలు కారులో వచ్చి మరీ చోరీకి పాల్పడటం. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్‌ అయ్యింది. ఇద్దరు మహిళలు మొదట కారు బయటకి దిగి ఇంటి వైపు నడిచారు. దీంతో మహిళలు మెయిన్ గేటుకు రెండు వైపులా ఉంచిన పూల కుండీలను వేగంగా దొంగిలించి తమ కారు వైపు పరుగులు తీశారు. ఇదిలా ఉంటే.. గత వారంలో ఈ ప్రాంతంలో దాదాపు 10 దొంగతనం సంఘటనలు నమోదయ్యాయి.

ఢిల్లీ-గురుగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌వేలోని ఆంబియన్స్ మాల్ ముందు ఉంచిన పూల కుండలు కూడా దొంగిలించబడ్డాయి. వాటిని ఎస్‌యూవీలో ఉంచుతున్న ఇద్దరు వ్యక్తుల వీడియో నెట్టింట్‌ చక్కర్లు కొట్టింది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఈ సంఘటన నివేదించబడింది. ఈ కేసులో గురుగ్రామ్‌లో 50 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ సంవత్సరం G20 శిఖరాగ్ర సమావేశం తరువాత ఢిల్లీ రోడ్లు పూల కుండీలు,ఇతర సంస్థాపనలతో అలంకరించబడిన తర్వాత అనేక ఇతర ఫ్లవర్‌పాట్ దొంగతనాలు నివేదించబడ్డాయి.

Next Story