షాకింగ్ వీడియో : ప‌క్షి ఎంత ప‌ని చేసింది.. కొద్దిలో ప్రాణాలే పోయేవి

TTE gets electrocuted after live wire falls on him at Kharagpur railway station.ప్ర‌మాదం ఎప్పుడు ఏ వైపు నుంచి ఎలా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Dec 2022 12:09 PM IST
షాకింగ్ వీడియో : ప‌క్షి ఎంత ప‌ని చేసింది.. కొద్దిలో ప్రాణాలే పోయేవి

ప్ర‌మాదం ఎప్పుడు ఏ వైపు నుంచి ఎలా వ‌స్తుందో ఎవ్వ‌రూ ఊహించ‌లేరు. రైల్వే స్టేష‌న్‌లో ఫ్లాట్‌ఫామ్‌పై నిలుచుని ఓ వ్య‌క్తితో మాట్లాడుతున్న ట్రావెలింగ్ టిక్కెట్ ఎగ్జామినర్ (టీటీఈ) ఒక్క‌సారిగా విద్యుత్ షాక్‌కు గురైయ్యాడు. ఈ ఘ‌ట‌న ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఖ‌ర‌గ్‌పూర్ రైల్వే స్టేష‌న్‌లో జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన సీసీ టీవీ దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

ఓ పక్షి పొడ‌వైన వైర్ తీసుకువెలుతోంది. రైల్వే స్టేష‌న్ ప్రాంతానికి చేరుకోగానే ఆ వైర్ హైవోల్టేజ్ విద్యుత్ లైన్‌కి తాకింది. అదే స‌మ‌యంలో ఫ్లాట్‌ఫామ్ అంచున నిలుచుని ఓ వ్య‌క్తితో మాట్లాడుతున్న టీటీఈకి వైర్ యొక్క రెండో కొన తాకింది. దీంతో విద్యుదాఘాతానికి గురైయ్యాడు. ఫ్లాట్‌ఫామ్ అంచు నుంచి త‌ల‌కిందులుగా రైలు ప‌ట్టాల‌పై ప‌డిపోయాడు. అది చూసి అత‌డితో అంత సేపు మాట్లాడుతున్న వ్య‌క్తి భ‌యంతో ప‌రుగులు తీశాడు.

టీటీఈని అక్క‌డే ఉన్న రైల్వే సిబ్బంది, ప‌లువురు ప్ర‌యాణీకులు కాపాడి ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అదృష్ట‌వ‌శాత్తు అత‌డికి ప్రాణాపాయం త‌ప్పింది. బాధితుడిని సుజ‌న్ సింఘ్ స‌ర్దార్‌గా గుర్తించారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.

ఈ ప్ర‌మాదం విచిత్రంగా జ‌రిగింద‌ని ఓ రైల్వే అధికారి ఒక‌రు సోష‌ల్ మీడియాలో తెలిపారు. ఒక ప‌క్షితీసుకువెలుతున్న పొడ‌వైన వైరు, రైల్వే హెటైన్ష‌న్ విద్యుత్ లైన్‌కు త‌గిలింది. గాల్లో వేలాడిన ఆ వైర్‌, ఫ్లాట్‌ఫామ్ అంచున నిలుచుని ఉన్న టీటీఈ త‌ల‌కి త‌గిలింది. దీంతో విద్యుదాఘాతానికి గురైయ్యాడు అని సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

Next Story