Video: బూతులతో రెచ్చిపోయిన టీటీడీ బోర్డు సభ్యుడు

నిత్యం గోవింద నామ స్మరణతో మార్మోగే తిరుమల ఆలయం ముందు టీటీడీ బోర్డు సభ్యుడు నరేశ్‌ కుమార్‌ బూతులతో రెచ్చిపోయాడు.

By అంజి
Published on : 19 Feb 2025 10:34 AM IST

TTD Board Member, Naresh Kumar, Misbehaviour, Employee, Tirumala

Video: బూతులతో రెచ్చిపోయిన టీటీడీ బోర్డు సభ్యుడు

నిత్యం గోవింద నామ స్మరణతో మార్మోగే తిరుమల ఆలయం ముందు టీటీడీ బోర్డు సభ్యుడు నరేశ్‌ కుమార్‌ బూతులతో రెచ్చిపోయాడు. మహాద్వారం గేటు నుంచి బయటకు పంపడం లేదని టీటీడీ ఉద్యోగి చెప్పడంతో ఆగ్రహంతో ఊడిపోయాడు.

నరేశ్‌కుమార్‌ మంగళవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తమ వారితో కలిసి మహాద్వారం వద్దకు చేరుకున్నారు. అప్పుడే బోర్డు మెంబర్‌ పక్కనే ఉన్న ఓ వ్యక్తి మహాద్వారం తలుపులు తీయాలని టీటీడీ ఉద్యోగిని కోరాడు. ఈవో, అడిషనల్‌ ఈవో ఆదేశాల మేరకు మహాద్వారం గేటు నుంచి ఎవరినీ పంపడం లేదని, ఉన్నతాధికారులు ఆదేశిస్తేనే తలుపులు తీస్తానని బదులిచ్చాడు. నిబంధనలు ప్రకారం బయటికి వెళ్లాలని ఉద్యోగి చెప్పాడు.

దీంతో 'ఏమనుకుంటున్నావ్‌? ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదా? థర్డ్‌ క్లాస్‌ వ్యక్తులను ఇక్కడ ఎవరు ఉంచారు?' అని ఉద్యోగిని నరేష్‌ దూషించారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన టీటీడీ వీజీవో సర్దిచెప్పడంతో సమస్య సద్దుమణిగింది. దీంతో అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తే ఇలా రౌడీలా వ్యవహరించడంపై భక్తులు మండిపడుతున్నారు. దీనికి సంబంధించి ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story