ప్రపంచంలో ఏ మూలన ఏమి జరిగిన సోషల్ మీడియా కారణంగా క్షణాల్లో అది అందరికి తెలిసిపోతుంటుంది. ఇక ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఓ బాలుడు తన తల్లితో కలిసి చదువుకుంటూ పదే పదే ఏడస్తున్న ఓ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోపై కొందరు మండిపడుతున్నారు. చిన్నారి తల్లిని ఆడిపోసుకుంటున్నారు.
మినీ చందన్ ద్వివేది అనే ఓ యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో బాలుడు 1 నుంచి 10 అంకెలు రాస్తుంటాడు. అయితే.. ఆ సమయంలో అమ్మ ఎక్కడ కొడుతుందోనని భయపడుతూ పదే పదే ఏడుస్తుండడం కనిపిస్తుంటుంది. నన్ను కొడవాతా అంటూ బాలుడు అడగడం వినిపిస్తుంది. తల్లిని కోపాన్ని చల్లార్చేందుకు బాలుడు ఆమెకు ముద్దు కూడా పెడతాడు.
ఇక వీడియో చివర్లో ఎందుకు ఏడస్తున్నావు అంటూ బాలుడి తల్లి అతడిని అడుగుతూ కన్నీళ్లు తుడుస్తుండడం చూడొచ్చు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారగా ఆరు మిలియన్ల మందికిపైగా వీక్షించారు. బిడ్డను మరీ అంతలా భయపెట్టి చదివించాలా అని ఒకరు కామెంట్ చేయగా, చదువు చెప్పే తీరు ఇదేనా అంటూ మరికొందరు మండిపడ్డారు. భయంతో కాకుండా ప్రేమగా చదివేలా చేయాలని ఇంకొందరు వ్యాఖ్యానించారు.