Video: ఇదేం దొంగతనం.. చివరికి దానిని కూడా వదలట్లేదు కదా!

హైదరాబాద్‌లో ఓ విచిత్ర దొంగతనం జరిగింది. కిషన్ బాగ్ ప్రాంతంలోని ఓ ఎలక్ట్రిక్ దుకాణం ఎదుట ఈ దొంగతనం జరిగింది.

By అంజి  Published on  9 Aug 2023 1:08 PM IST
Kishan Bagh, Hyderabad, Thief Robbed Bulb

Video: ఇదేం దొంగతనం.. చివరికి దానిని కూడా వదలట్లేదు కదా!

ప్రతిచోట రకరకాల దొంగతనాలు జరుగుతూ ఉండడం టీవీల్లో వార్త పేపర్లో చూస్తూ ఉంటాం. చదువుతూ ఉంటాం.. కొందరు దొంగలు తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్‌గా చేసుకొని దొంగతనాలకు పాల్పడతారు. మరి కొంతమంది చైన్ స్నాచింగ్ చేస్తూ ఉంటారు. ఇంకొందరు షాపులు, దేవాలయములు, ఏటీఎంల వద్ద దొంగతనాలకు పాల్పడుతూ ఉంటారు. ఇలా రకరకాల దొంగతనాలకు పాల్పడుతూ ఉంటారు. కానీ ఓ దొంగ మాత్రం చిత్ర విచిత్రమైనది దొంగతనం చేసిన ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. నగరంలోని కిషన్ బాగ్ ప్రాంతంలోని ఓ ఎలక్ట్రిక్ షాపు ముందు ఒక దొంగతనం జరిగింది. ఓ వ్యక్తి అర్థరాత్రి సమయంలో దుకాణం వద్దకు వచ్చి అక్కడ చాలా సేపు నిలబడ్డాడు. రోడ్డుపై అటు ఇటు వెళ్తున్న వాహనాలను చూస్తూ అక్కడే చాలాసేపు నిలబడి ఉండిపోయాడు. అనంతరం రోడ్డుపై ఎవ్వరు రావడంలేదని నిర్ధారణ చేసుకొని ఇక తాను వచ్చిన పని చేయాలని నిర్ణయించుకున్నాడు. తన చేతివాటాన్ని ప్రదర్శించాడు.

ఎలక్ట్రిక్ షాప్ ముందు ఒక ఎలక్ట్రిక్ బల్బ్ పెట్టి ఉంది. అయితే ఆ వ్యక్తి పైన ఉన్న వైరును గట్టిగా లాగాడు. వైరుతో పాటు దానికి ఉన్న బల్బు కూడా కిందికి వచ్చింది. దీంతో వెంటనే ఆ వ్యక్తి బల్బును దొంగలించి ఎంచక్కా బ్యాగ్ లో పెట్టుకొని మెల్లిగా అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్లిపోయాడు. అయితే దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఉదయం షాప్ యజమాని వచ్చి చూసేసరికి కరెంటు వైర్ వేలాడుతూ ఉండడం కనిపించింది. అసలు ఏం జరిగింది అబ్బా అని షాప్ యజమాని సీసీ పుటేజీ ఓపెన్ చేసి చూసి ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అనంతరం తన షాపులో దొంగతనం జరగలేదని రిలాక్స్ అయి చిల్లర దొంగను చూసి నవ్వుకున్నాడు. ఈ దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సిసి కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా అవ్వడంతో దానిని చూసిన నెటిజన్లు సైతం దొంగ తెలివికి ముసిముసిగా నవ్వుతూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

Next Story