ట్రైన్‌లో చిక్కిన దొంగ.. కిటికీకి వేలాడదీసిన ప్రయాణికులు (వీడియో)
బస్సులు, రైళ్లలో దొంగలు రెచ్చిపోతుంటారు. కొంచెం రద్దీగా కనిపిస్తే చాలు తమ చేతివాటం చూపెడతారు.
By Srikanth Gundamalla Published on 4 Sept 2023 11:53 AM ISTట్రైన్‌లో చిక్కిన దొంగ.. కిటికీకి వేలాడదీసిన ప్రయాణికులు (వీడియో)
బస్సులు, రైళ్లలో దొంగలు రెచ్చిపోతుంటారు. కొంచెం రద్దీగా కనిపిస్తే చాలు తమ చేతివాటం చూపెడతారు. మనకు తెలియకుండా మన జేబులు కొట్టేసి.. ఖాళీ చేసేస్తారు. అయితే.. బీహార్‌లో ఓ దొంగ ట్రైన్‌లో మహిళ నుంచి పర్సు కొట్టేశాడు. ఆ తర్వాత ట్రైన్ దిగి పారిపోయేందుకు ప్రయత్నం చేశాడు. కానీ..అతడి బ్యాడ్ లక్‌తో ఇతర ప్రయాణికులకు చిక్కాడు. అతడ్ని కిటికి లోపలి నుంచే పట్టుకున్నారు. ట్రైన్ కదిలింది.
ఆ దొంగ కిటికీని పట్టుకుని వేలాడాడు. అలా కొన్ని కిలోమీటర్ల పాటు కిటికీని పట్టుకునే ఉండిపోయాడు దొంగ. ఇతర ప్రయాణికులు దొంగ కూడా కింద పడిపోకుండా అతడిని చేతులతో గట్టిగా పట్టుకున్నారు. కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడా నెట్టింట ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటన కటిహార్ నుంచి సమస్తిపూర్ వెళ్తున్న రైలులో జరిగింది. మహిళ నుంచి పర్సు లాక్కుని వెళ్తున్న క్రమంలో గమనించిన కొందరు ప్రయాణికులు కిటికీ లోపలి నుంచి అతడిని పట్టుకున్నారు.
రైలు కొన్ని కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత బచ్వారా జంక్షన్ చేరుకుంది. అక్కడ ట్రైన్ ఆగిపోవడంతో.. ఆర్పీఎఫ్ పోలీసులకు ప్రయాణికులు సమాచారం ఇచ్చారు. అప్పటికే స్టేషన్‌లో రెడీగా ఉన్న రైల్వే పోలీసులు దొంగను అదుపులోకి తీసుకున్నారు. దొంగకు సరైన గుణపాఠం చెప్పారంటూ పలువురు నెటిజన్లు వీడియోకు కామెంట్స్ పెడుతున్నారు.
#बेगूसराय में चलती ट्रेन से लटका चोरसोनपुर बरौनी रेलखंड के बछवाड़ा जंक्शन के समीप एक युवक को चोरी के शक में लोगों से बचने के लिए किमी तक ट्रेन की खिड़की से लटका रहा । इसके बाद बछवाड़ा जंक्शन पहुचने पर वहां लोगों ने उतारकर उसे आरपीएफ के हवाले कर दिया। #railway #viralvideo pic.twitter.com/aFgkWQktsQ
— Ghanshyam Dev (@Ghanshyamdev3) September 2, 2023