నగల దుకాణంలో మూడు నిమిషాల్లో లూటీ చేసిన దొంగలు (వీడియో)

దొంగలు రెచ్చిపోతున్నారు. జల్సాలకు అలవాటు పడ్డవారు దోపిడీలకు పాల్పడుతున్నారు.

By Srikanth Gundamalla  Published on  17 Jun 2024 5:57 AM GMT
theft,  jewellery, america,   viral video,

నగల దుకాణంలో మూడు నిమిషాల్లో లూటీ చేసిన దొంగలు (వీడియో)

దొంగలు రెచ్చిపోతున్నారు. జల్సాలకు అలవాటు పడ్డవారు దోపిడీలకు పాల్పడుతున్నారు. అమెరికాలో అయితే నిత్యం ఏదో ఒక క్రైమ్‌ స్టోరీలు జరుగుతున్నాయి. బ్రాండెడ్‌ షోరూంల నుంచి కూడా దొంగలు వస్తువులను దోచుకెళ్తున్నారు. తాజాగా కాలిఫోర్నియాలో సినిమా ఫక్కీలో చోరీకి పాల్పడ్డారు దొంగలు. ఓ భారత వ్యాపారికి చెందిన జువెలరీ షాపులో దొంగతనం జరిగింది. కేవలం మూడే మూడు నిమిషాల్లో దుకాణాన్ని లూటీ చేశారు. ఈ నెల 12న అర్ధరాత్రి ఈ చోరీ సంఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం చోరీకి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలను చూస్తే.. సుమారు 20 మంది ముసుగు దొంగలు ఈ చోరీకి పాల్పడ్డారు. షాప్‌కి కాపలాగా ఉన్న సెక్యూరిటీ గార్డును ఒక్కసారిగా భయపెట్టి.. ఆ తర్వాత అద్దాల ద్వారాన్ని పగలగొట్టి లోనికి ఎంట్రీ ఇచ్చారు. వెంటనే షోరూం మొత్తం అందరూ వ్యాపించారు. డెస్కుల అద్దాలను పగలగొట్టి అందినకాడికి ఆభరణాలను బ్యాగుల్లో వేసుకుని అక్కడి నుంచి ఉడాయించారు. ఈ దోపిడీకి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. అవి కాస్త బయటకు రావడంతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోన్నాయి. ఈ దోపిడీపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. మిగతా 15 మమంది కోసం విచారిస్తున్నట్లు చెప్పారు.

Next Story