తమిళనాడులో రిపబ్లిక్ వేడుకల్లో ఓ పోలీస్ కమిషనర్ గుండెపోటుకు గురయ్యాడు. కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలలో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ప్రసంగిస్తుండగా ఉన్నట్టుండి కమిషనర్ థామ్సన్ జోస్ కుప్పకూలాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో కమిషనర్ థామ్సన్ జోస్ ఒక్కసారిగా కుప్పకూలి పోవడం స్పష్టంగా కనిపించింది. తమిళనాడు - తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలకు సర్వసిద్ధం చేశారు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన తర్వాత గవర్నర్ మాట్లాడుతున్న సమయంలో.. అక్కడే నిల్చున్న సీపీ థామ్సన్ జోస్ గుండెపోటుకు గురై.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన తోటి అధికారులు ఆయన్ను హుటాహుటిన స్టేజ్ వెనక్కి తీసుకుని వెళ్లి సీపీఆర్ చేశారు. అనంతరం ఆయనను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించగా..చికిత్స అనంతరం కోలుకున్నారు.