ఫ్రీ జర్నీ.. బస్సులో వెల్లుల్లి పొట్టు తీసిన మహిళలు, వైరల్‌ వీడియో

మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది ప్రభుత్వం.

By Srikanth Gundamalla  Published on  21 July 2024 2:00 PM IST
Telangana, rtc bus, free journey, woman, viral video,

ఫ్రీ జర్నీ.. బస్సులో వెల్లుల్లి పొట్టు తీసిన మహిళలు, వైరల్‌ వీడియో 

తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. అయితే.. ఈ వెసులుబాటును రాష్ట్ర మహిళలు పెద్ద ఎత్తున వినియోగించుకుంటున్నారు. దాంతో.. రద్దీ బస్సుల్లో బాగా పెరిగిపోయింది. కొన్ని రూట్లలో అయితే కూర్చొనేందుకు కాదు కదా.. నిలబడేందుకు కూడా స్థలం దొరకడం లేదు. ఇటీవల సీట్ల కోసం మహిళలు కొట్టుకున్న వీడియోలు వైరల్ అయ్యిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే ఫ్రీ బస్సు సదుపాయంలో మహిళలు చేసిన పనికి నెటిజన్లు షాక్‌ అవుతున్నారు.

హన్మకొండ నుంచి సిద్దిపేట వెళ్తున్న బస్సులో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సులో ఒకే సీట్లో కూర్చొని వెల్లుల్లి పొట్టు తీసుకుంటూ. చక్కగా ముచ్చట్లు పెడుతూ ఇద్దరు మహిళలు ప్రయాణం చేస్తున్నారు. బస్సులో ఉన్న కొందరు దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్‌ చేయగా.. నెట్టింట వైరల్ అవుతోంది. గమ్యం చేరడాఇకి దాదాపు రెండున్నర గంటల సమయం పడుతుందని.. దాంతో.. ఈ సమయంలో ఇంట్లో చేయాల్సిన పనులను బస్సుల్లోనే చక్కబెట్టేస్తూ కనిపించారు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. ఆర్టీసీ బస్సుకు ఏం కర్మ పట్టిందిరా నాయనా అంటున్నారు. కందరు నవ్వుతోన్న ఎమోజీలను పెడుతూ సరదాగా నవ్వుకుంటున్నారు. కొందరైతే తీసిన పొట్టు ఎవరిని నెత్తిన తలంబ్రాలు పోయకుండా జర జాగ్రత్తగా మూట్టకట్టుకుని పోవాలంటూ సలహా ఇస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది.

ఇంతకుముందు ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలు చేసిన కామెంట్స్‌ను కూడా నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు. కొంద‌రు ఇంట్లో బోర్ కొడుతుంటే టైం పాస్‌కు బ‌స్ ఎక్కామ‌ని అంటే, ఇంకొకావిడ పిల్ల‌ల‌కు అన్నం తినిపించ‌డానికి బ‌స్సు ఎక్కామ‌ని చేసిన రీల్స్ సోషల్ మీడియాలో వైర‌ల్ కావ‌డం చూశాం. తాజాగా వచ్చిన ఈ వీడియో మరో లెవల్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

Next Story