నదిలో కొట్టుకుపోతున్న బాలుడిని కాపాడారు.. లైవ్‌ వీడియో

జమ్ముకశ్మీర్‌ శ్రీనగర్‌ సమీపంలోని సఫాకడల్‌లో నదిలో కొట్టుకుపోతున్న బాలుడిని ఇద్దరు స్థానికులు ప్రాణాలకు తెగించి కాపాడారు.

By అంజి  Published on  27 May 2024 2:34 PM IST
Srinagar,  Safakadal, Viral news, Jammu Kashmir

నదిలో కొట్టుకుపోతున్న బాలుడిని కాపాడారు.. లైవ్‌ వీడియో

జమ్ముకశ్మీర్‌ శ్రీనగర్‌ సమీపంలోని సఫాకడల్‌లో నదిలో కొట్టుకుపోతున్న బాలుడిని ఇద్దరు స్థానికులు ప్రాణాలకు తెగించి కాపాడారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం జీలం నదిలో ఏడేళ్ల బాలుడు కొట్టుకుపోతుండటాన్ని జహూర్‌ అహ్మద్‌, షౌకత్‌ అహ్మద్‌ గుర్తించారు. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వెంటనే నదిలోకి దిగి బాలుడిని ఒడ్డుకు చేర్చారు. సీపీఆర్‌ (కార్డియోపల్మోనరీ రిససిటేషన్) చేసి చిన్నారిని బతికించి, ఆస్పత్రికి తరలించారు.

"మొదట అతను చనిపోయాడని మేము అనుకున్నాము. కానీ కొన్ని నిమిషాలు సీపీఆర్‌ చేసిన తర్వాత, మేము అతన్ని సజీవంగా కనుగొన్నాము. సమయం వృథా చేయకుండా, మేము అతనిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించాము, అక్కడ వైద్యులు అతనిని కాపాడారు'' అని రక్షకులలో ఒకరు చెప్పారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కాగా బాలుడిని కాపాడిన ఆ ఇద్దరిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

కాగా "మేము అక్కడ ఉన్నందుకు అతని ప్రాణాలు నిలిచాయి" అని వారు తెలిపారు. తమ మైనర్ పిల్లలను నీటి వనరుల దగ్గరకు వెళ్లనివ్వవద్దని, ఇది చాలా ప్రమాదకరమని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జహూర్ అహ్మద్, షోకత్ అహ్మద్‌ల చిత్రాలు సోషల్ మీడియాలో కనిపించిన వెంటనే నెటిజన్లు వారిని నిజమైన హీరోలుగా కొనియాడారు.

Next Story