ఎగురుతున్న విమానంలో పాము కలకలం (వీడియో)

ఎగురుతున్న విమానంలో పాములు ప్రత్యక్షం అయింది. దాంతో.. విమానంలోని ప్రయాణికులంతా ఒక్కసారిగా హడలిపోయారు.

By Srikanth Gundamalla  Published on  20 Jan 2024 2:14 AM GMT
snake,  flying flight, viral video,

ఎగురుతున్న విమానంలో పాము కలకలం (వీడియో)

ఎగురుతున్న విమానంలో పాములు ప్రత్యక్షం అయింది. దాంతో.. విమానంలోని ప్రయాణికులంతా ఒక్కసారిగా హడలిపోయారు. ఈ సంఘటన థాయర్‌ ఎయిర్‌ ఏషియా విమానంలో చోటుచేసుకుంది. పాము విమానంలో కనిపించడంతో ప్రయాణికులు ఫోన్లలో వీడియో రికార్డు చేశారు. ప్రస్తుం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బ్యాంక్‌ నుంచి పుకెట్‌కు బయల్దేరింది థాయ్ ఎయిర్ ఏషియాకు చెందిన ఎఫ్‌డీ3015 విమానం. అయితే.. అందులో ఒకరు రీల్స్‌ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే విమానంలో పాము ఉన్నట్లు గుర్తించారు. ఇక వెంటనే స్పందించిన సిబ్బంది పామును పట్టుకునే ప్రయత్నం చేశారు. కాసేపు శ్రమించిన తర్వాత విమానాన్ని ప్లాస్టిక్‌ బాటిల్‌లోకి పంపించారు. ఆ తర్వాత దాన్ని లగేజ్‌ పెట్టే అల్మారాలో భద్రపరిచారు. విమానం ఎగురుతున్న సయమంలో పాము కనిపంచడంతో ఒక్కసారిగా ప్రయాణికులంతా ఆందోళనకు గురయ్యారు. కాగా.. మామూలుగా ట్రైన్లు, బస్సుల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతుండటం చూస్తుంటాం. కానీ.. విమానం విషయాల్లో సిబ్బంది అతిజాగ్రత్తతో ఉంటారు. ఎప్పుడు పరిశుభ్రతను పాటిస్తారు. కానీ.. ఏకంగా విమానంలోకి పాము రావడం మాత్రం కలకలం రేపింది.

ఇక చివరకు విమానం ల్యాండ్ అయిన వెంటనే పామును బయటకు వదిలేశారు. విమానంలోకి వచ్చిన పాము విషపూరితమైనది కాదని సిబ్బంది తెలిపారు. విమానాలు ప్రయాణానికి ఇద్ధంగా ఉన్నప్పుడు ప్యాసింజర్ల క్యారీ ఆన్‌ లగేజీని ఫుకెట్‌ విమానాశ్రయంలో క్షుణ్ణంగా పరిశీలించారు. అయినా పాము ఎలా విమానంలోకి వచ్చిందనేది మాత్రం మిస్టరీగానే ఉండిపోయింది. అయితే.. ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి అపాయం జరగ్గకపోవడంతో అంతా ఊపరిపీల్చుకున్నారు. ఈ సంఘటనపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.


Next Story