ఓ వైపు పెళ్లి.. మ‌రోవైపు అతిథుల‌ కొట్లాట‌.. వీడియో వైర‌ల్‌

Shocking Video Shows A Wedding Ceremony Spiralling Into A Fierce Fight. శుభ‌మా అని పెళ్లి చేసుకుంటుంటే మ‌ధ్య‌లో మీ గోల

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Dec 2022 10:52 AM IST
ఓ వైపు పెళ్లి.. మ‌రోవైపు అతిథుల‌ కొట్లాట‌.. వీడియో వైర‌ల్‌

సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని ప్ర‌పంచంలో ఎక్క‌డ ఏమి జ‌రిగినా క్ష‌ణాల్లో అది తెలిసిపోతుంది. తాజాగా ఓ వీడియో వైర‌ల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటీజ‌న్లు అయ్యో పాపం శుభ‌మా అని పెళ్లి చేసుకుంటుంటే మ‌ధ్య‌లో మీ గోల ఏంటిరా అని కామెంట్లు పెడుతున్నారు.

అక్క‌డ సాంప్ర‌దాయ బ‌ద్ధంగా పెళ్లి జ‌రుగుతోంది. పురోహితుడు ఓ వైపు వేద‌మంత్రాల‌ను ప‌ఠిస్తున్నాడు. వారి ఆచారం ప్ర‌కారం వ‌ధువు వ‌రుడికి హార‌తి ఇస్తోంది. ఇంత‌లో ఏం జ‌రిగిందో తెలీదు గానీ పెళ్లికి హాజ‌రైన అతిథుల్లో కొంద‌రు కొట్టుకోవ‌డం మొద‌లుపెట్టారు. ఒక‌రిపై మ‌రొక‌రు ప‌డిగుద్దుల వ‌ర్షం కురిపించుకున్నారు. దీంతో అక్క‌డ గంద‌ర‌గోళ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఇది గ‌మ‌నించిన వ‌రుడు కింద‌కు వెళ్లేందుకు య‌త్నించ‌గా బంధువులు అడ్డుకున్నారు.

ఈ ఘ‌ట‌న ఎప్పుడు ఎక్క‌డ జ‌రిగిందో తెలీదు గానీ ఆర్కే రాజ్ అనే యూజ‌ర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో పోస్ట్ చేయ‌గా వైర‌ల్‌గా మారింది. ఇప్ప‌టికే 11ల‌క్ష‌ల మందికి పైగా ఈ వీడియోను చూశారు. దీనిపై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. శుభ‌మా అని వాళ్లు పెళ్లి చేసుకుంటుంటే మ‌ధ్య‌లో మీ గొడ‌వ ఏందిరా..? అంటూ ఓ నెటీజ‌న్ కామెంట్ చేయ‌గా.. మండ‌లం పైన మాత్ర‌మే కాదు కింద కూడా మంట మొద‌లైంది అంటూ మ‌రో యూజ‌ర్ కామెంట్ చేశాడు.

Next Story