మహిళ ప్యాంట్‌ జేబులో పేలిన సెల్‌ఫోన్..మంటలు చెలరేగడంతో..

బ్రెజిల్‌లో ఊహించని ఘటన జరిగింది. తన భర్తతో కలిసి ఓ యువతి సూపర్ మార్కెట్‌లో షాపింగ్ చేస్తుండగా అకస్మాత్తుగా తన ప్యాంట్‌లోని మొబైల్ ఒక్కసారిగా పేలింది.

By Knakam Karthik
Published on : 12 Feb 2025 11:18 AM IST

World News, Brazil, Mobile Blast, Viral Video

మహిళ ప్యాంట్‌ జేబులో పేలిన సెల్‌ఫోన్..మంటలు చెలరేగడంతో..

బ్రెజిల్‌లో ఊహించని ఘటన జరిగింది. తన భర్తతో కలిసి ఓ యువతి సూపర్ మార్కెట్‌లో షాపింగ్ చేస్తుండగా అకస్మాత్తుగా తన ప్యాంట్‌లోని మొబైల్ ఒక్కసారిగా పేలింది. వస్తువులు కొనుగోలు చేస్తున్న సమయంలో ఆమె బ్యాక్ ప్యాకెట్‌లో ఉన్న మొబైల్ ఫోన్ ఒక్కసారిగా పేలింది. ఈ క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ పేలుడులో మహిళ వెనుక భాగంతో పాటు, చేతులకు కూడా తీవ్ర గాయాలైనట్లు కథనాలు ప్రసారమయ్యాయి. అయితే మొబైల్ ఫోన్ పేలిన దృశ్యాలు సూపర్ మార్కెట్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడున్న వారు షాక్‌కు గురయ్యారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story