వీల్‌చైర్‌లో ఉన్న వికలాంగుడికి సహాయం చేయడానికి బ్యాంకు నుండి బయటకు వచ్చిన ఎస్‌బిఐ ఉద్యోగికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది జైపూర్ బ్యాంకు శాఖలో జరిగింది. దీంతో బ్యాంకు సిబ్బందికి ఇప్పుడు అందరూ సలాం కొడుతున్నారు. సిబ్బంది నిశ్శబ్ద దయగల చర్య, మానవత్వం.. మనుషుల్లో ఇంకా అక్కడక్కడ బతికే ఉందని గుర్తు చేస్తోంది. సిబ్బందిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
దినేష్ సోనావానే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన హృదయాలను కదిలించే వీడియోలో.. ఒక వైకల్యం ఉన్న వ్యక్తికి తన బ్యాంకింగ్ పనిని పూర్తి చేయడానికి సహాయం చేయడానికి SBI ఉద్యోగి బ్యాంకు నుండి బయటకు వచ్చాడు. మెట్లు ఎక్కలేని ఆ వ్యక్తి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చౌరా రాస్తా బ్రాంచ్ వెలుపల ప్రత్యేకంగా రూపొందించిన సైకిల్ వాహనంపై కూర్చుని ఉన్నాడు.
అతన్ని లోపలికి రమ్మని అడిగే బదులు, బ్యాంకు ఉద్యోగి అతని వద్దకు నడిచి వెళ్లాడు. ఆ వ్యక్తి తన శారీరక పరిమితుల కారణంగా దాదాపు ఐదు సంవత్సరాలుగా బ్యాంకులోకి ప్రవేశించలేకపోయాడు. దీంతో అతడి బ్యాంకింగ్ పనిని ఆ ఉద్యోగి చేసి పెట్టాడు. అందరినీ కలుపుకునే, కరుణామయ సేవకు ఉదాహరణగా నిలిచినందుకు నెటిజన్లు SBI సిబ్బందిని ప్రశంసిస్తున్నారు.