Video: జలపాతంలోకి దూసుకెళ్లిన కారు.. రక్షించండంటూ కేకలు

మధ్యప్రదేశ్‌లో ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. ఇండోర్ సమీపంలోని లోహియా కుంద్ జలపాతం చూడటానికి వచ్చిన ఒక కుటుంబం కారుని జలపాతం దగ్గరలో పార్క్ చేసింది.

By అంజి  Published on  8 Aug 2023 3:30 AM GMT
waterfall, father-daughter saved, Madhya Pradesh,  Simrol

Video: జలపాతంలోకి దూసుకెళ్లిన కారు.. రక్షించండంటూ కేకలు 

మధ్యప్రదేశ్‌లో ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. ఇండోర్ సమీపంలోని లోహియా కుంద్ జలపాతం చూడటానికి వచ్చిన ఒక కుటుంబం కారుని జలపాతం దగ్గరలో పార్క్ చేసింది. అయితే హ్యాండ్ బ్రేక్ వెయ్యని కారణంగా ఆ కారు ఒక్కసారిగా జలపాతం కొలనులోకి దూసుకెళ్లింది. ఆ కారులో ఉన్న పాపని, వ్యక్తిని చుట్టుపక్కల వాళ్ళు కాపాడారు. ఇండోర్ నగరానికి 60 కిలోమీటర్ల దూరంలోని సిమ్రోల్‌లో ఈ ఘటన జరిగింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో.. రెడ్‌ కారు రాయి ఉపరితల అంచుపై నుండి జారిపడి కొలనులోకి దూకడం చూడవచ్చు. కారు కొలనులోకి పడిన కొన్ని సెకన్ల తర్వాత, నీటికి దగ్గరగా ఉన్న వ్యక్తి లోపలికి దూకి వాహనం వైపు ఈదుకున్నాడు.

మరోవైపు సహాయం కోసం కారులో ఉన్నవారు గట్టిగా కేకలు వేశారు. “ఒక కారు జలపాతంలో పడటం చూశాను. వాహనం జారిపోతున్నప్పటికీ కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులైన ఒక వ్యక్తి మరియు అతని 13 ఏళ్ల కుమార్తె దిగేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే, ఇద్దరూ లోపల ఉండగానే కారు పడిపోయింది” అని ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న సునీల్ మాథ్యూ (26) తెలిపారు. "వారు మునిగిపోయారు. నేను దూకి కారులో ఉన్న వ్యక్తిని రక్షించాను. చుట్టుపక్కల వారు అతని కుమార్తెను రక్షించారు. నేను ఈ సంఘటనను చూసి కొంత సేపు షాక్‌లో ఉన్నాను, కానీ ధైర్యం కూడగట్టుకుని లోపలికి దూకాను” అని అతను చెప్పాడు.

తండ్రీకూతుళ్లిద్దరూ ప్రాణాలతో బయటపడినందుకు సంతోషంగా ఉందన్నారు. ఇదిలావుండగా, డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (రూరల్) సునీల్ మెహతా తెలిపారు. “కారు అజాగ్రత్తగా జలపాతం కొలనుకు చాలా దగ్గరగా పార్క్ చేయబడింది. కారు ట్రంక్‌ను బలవంతంగా మూసివేసిన తర్వాత రోలింగ్ ప్రారంభించి, జలపాతం కొలనులో పడిపోయిందని మాకు తెలిసింది, ”అని ఎస్పీ చెప్పారు. వర్షాకాలం, ఆదివారం కావడంతో ఈ ప్రాంతంలో విహారయాత్రకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు.

Next Story