Viral: పిల్లి కూన అని పెంచుకుంది.. తీరా అసలు విషయం తెలిసి..

ఓ మహిళ రోడ్డు పక్కన ఒంటరిగా అచేతనాస్థితిలో రోజుల వయస్సున్న పెంపుడు పిల్లి కూన అనుకుని చేరదీసింది. ఆమె దానిని ఇంటికి తీసుకెళ్లి పెంచింది.

By అంజి  Published on  26 Sept 2023 12:07 PM IST
Russian woman, black panther, Viral news

Viral: పిల్లి కూన అని పెంచుకుంది.. తీరా అసలు విషయం తెలిసి..

ఓ మహిళ రోడ్డు పక్కన ఒంటరిగా అచేతనాస్థితిలో రోజుల వయస్సున్న పెంపుడు పిల్లి కూన అనుకుని చేరదీసింది. ఆమె దానిని ఇంటికి తీసుకెళ్లి పెంచింది. కొన్ని రోజులకు ఆమెకు అసలు విషయం తెలిసి ఆశ్చర్యపోయింది. అది పెరిగేకొద్దీ, అది పెంపుడు పిల్లి కాదని.. బ్లాక్‌ పాంథర్ అని ఆమె గ్రహించింది. ఆమె పాంథర్‌ను రక్షించడం, చూసుకోవడం యొక్క వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పాంథర్‌ను రక్షించడంలో ఆమె కరుణతో చేసిన చర్య సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించింది. ఈ వైరల్‌ సంఘటన రష్యా దేశంలో జరిగింది.

రష్యాకు చెందిన ఓ మహిళ రోడ్డు వెంట నడుస్తుండగా.. చెట్ల పొదల్లో ఓ పసి కూనను గుర్తించింది. మొదట పెంపుడు పిల్లి కూన అనుకుని తన వెంటతీసుకెళ్లి రక్షించింది. తన పెంపుడు కుక్కతో పాటే దానికి ఆహారం అందించింది. అయితే ఆ కూన పెరుగుతున్న క్రమంలో అది పిల్లి కాదని, బ్లాక్‌ పాంథర్‌(నల్ల చిరుత) అని గ్రహించి సదరు మహిళ ఆశ్చర్యానికి గురైంది. ఆ తర్వాత కూడా నల్ల చిరుతను తనతోపాటే ఉంచుకొని అనుబంధం పెంచుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

మొదట బ్లాక్‌ పాంథర్‌ దొరికిన స్థితి నుంచి అది పెరిగి పెద్దదయి ఆడుకుంటున్న వరకు అన్నింటిని కలిపి చేర్చిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌ అవుతోంది. ఇప్పటికే ఈవీడియోకు మిలియన్లలో వ్యూస్‌ వచ్చాయి. ఈ వీడియోను @factmayor అనే యూజర్‌ Instagramలో షేర్‌ చేసారు. ఇది మొదట @luna_the_pantera ద్వారా అప్‌లోడ్ చేయబడింది. ఈ పోస్ట్ సెప్టెంబర్ 21న షేర్ చేయబడింది. షేర్ చేయబడినప్పటి నుండి, ఇది 9.1 మిలియన్లకు పైగా వీక్షణలను సంపాదించింది.

Next Story