ఆ ర్యాపర్‌ చేసిన పనికి మహిళా అభిమాని షాక్‌.. వీడియో

Rapper Bad Bunny throws away fan’s phone in viral video. సెలబ్రిటీలు.. అభిమానుల పట్ల ప్రవర్తించే తీరు ఎల్లప్పుడూ హృదయపూర్వకంగా

By అంజి  Published on  4 Jan 2023 9:11 AM GMT
ఆ ర్యాపర్‌ చేసిన పనికి మహిళా అభిమాని షాక్‌.. వీడియో

సెలబ్రిటీలు.. అభిమానుల పట్ల ప్రవర్తించే తీరు ఎల్లప్పుడూ హృదయపూర్వకంగా లేదా మధురంగా ​​ఉండదు. కొన్ని సార్లు సెలబ్రిటీలు దురుసుగా ప్రవర్తించే సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇక కొన్నిసార్లు అభిమానులు తమ ప్రవర్తనతో సెలబ్రిటీలకు విసుగు తెప్పిస్తుంటారు. వారి గోప్యతను ఆక్రమించుకుంటారు. ఫలితంగా చాలా సెలబ్రిటీలకు చికాకు ఏర్పడుతుంది. తాజాగా అలాంటి ఘటనే జరిగింది. రాపర్ బ్యాడ్‌ బన్నీగా పేరొందిన బెనిటో ఆంటోనియో మార్టనెజ్ ఒకాసియోతో ఓ మహిళా ఫ్యాన్‌ సెల్ఫీ తీసుకునే ప్రయత్నించింది. సెల్ఫీ కోసం అభిమాని ర్యాపర్‌ బ్యాడ్‌ బన్నీ ముఖానికి దగ్గరికి వచ్చింది. దీంతో ర్యాపర్‌కు చిర్రెత్తుకొచ్చి.. మహిళా అభిమాని ఫోన్‌ను గుంజుకుని విసిరేశాడు.

దీంతో ఆ ఫ్యాన్‌ ఒక్కసారిగా షాకైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. బ్యాడ్‌ బన్నీ తన సెక్యూరిటీ సిబ్బందితో కలిసి స్టేజి దగ్గరకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ వీడియోను ట్విట్ట‌ర్‌లో షేర్ చేయ‌గా ఇప్ప‌టివ‌ర‌కూ 1.26 ల‌క్ష‌ల మంది చూశారు. సోషల్‌ మీడియాలో ఈ వీడియో వైర‌ల్ కావ‌డంతో ఈ ఘ‌ట‌న‌పై ర్యాప‌ర్ బ్యాడ్‌ బన్నీ స్పందించారు. ''ఎవరైనా తనకు హలో చెప్పేందుకు, నాతో ఏదైనా మాట్లాడేందుకు, నన్ను కలవడానికి వస్తే.. వారికి నేను ఎంతో గౌరవం ఇచ్చి పలకరిస్తాను. అయితే ఎవ‌రైనా ఫోన్ త‌న ముఖంపైకి తీసుకువ‌స్తే అది త‌న ప‌ట్ల అమర్యాద‌క‌రంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్టు భావిస్తాన‌ని, వారిని అదే రీతిలో ట్రీట్ చేస్తాను'' అని ఆయ‌న ట్వీట్ చేశారు. అయితే ర్యాపర్‌పై నెటిజన్లు భిన్న రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.


Next Story