ప్రతిరోజూ ఇంటర్నెట్‌లో ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా బస్సులోపల రాజస్థానీ జానపద కళాకారులు పాడిన పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఇస్మాయిల్ లంగా గ్రూప్‌కు చెందిన రాజస్థానీ జానపద కళాకారులు షకీరా హిట్ పాట 'వాకా వాకా' ప్రత్యేకమైన వెర్షన్‌ను పాడుతూ కనిపించారు. సాంప్రదాయ రాజస్థానీ సంగీతం, సంస్కృతితో షకీరా పాటను మిక్స్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అప్‌లోడ్ చేసిన ఒక్క రోజులోపే దీనికి 70 వేల కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఇస్మాయిల్ లంగా గ్రూప్ షేర్ చేసిన ఈ వీడియోలో.. కళాకారులు రంగురంగుల సాంప్రదాయ దుస్తులలో కనిపిస్తారు.. దక్షిణాఫ్రికాలో జరిగిన 2010 FIFA వరల్డ్ కప్ అధికారిక పాట 'వాకా వాకా' ట్యూన్‌కు పాటలు పాడుతూ, నృత్యం చేస్తున్నారు. అయితే.. కళాకారులు పాటలోని సాహిత్యాన్ని 'వెల్‌కమ్ టు రాజస్థాన్'గా మార్చారు. దానికి 'ఖమ్మ ఘనీ' వంటి పదబంధాలను జోడించారు. ఈ మోడిఫైడ్ వెర్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కళాకారుల సృజనాత్మకతను ప్రశంసించారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ జట్టు రాజస్థాన్ రాయల్స్ సోషల్ మీడియా హ్యాండిల్ కూడా వీడియోపై వ్యాఖ్యానించింది, లువాన్-డ్రే ప్రిటోరియస్, క్వేనా మఫాకా, నాండ్రే బెర్గర్, డోనోవన్ ఫెరీరాతో సహా అంతర్జాతీయ ఆటగాళ్లను ట్యాగ్ చేసింది.